Vithika Sheru: చెల్లెలు కుమారుడి బారసాల ఫంక్షన్.. వితికా షెరు సర్‌ప్రైజ్ ఏంటో తెలుసా? వీడియో

Vithika Sheru: చెల్లెలు కుమారుడి బారసాల ఫంక్షన్.. వితికా షెరు సర్‌ప్రైజ్ ఏంటో తెలుసా? వీడియో


Vithika Sheru: చెల్లెలు కుమారుడి బారసాల ఫంక్షన్.. వితికా షెరు సర్‌ప్రైజ్ ఏంటో తెలుసా? వీడియో

బిగ్ బాస్ ఫేమ్, నటి, వరుణ్ సందేశ్ భార్య వితికా షెరుకు తన చెల్లి కృతిక అంటే చెప్పలేనంత ప్రేమ. తనకు పెళ్లయినప్పటికీ సోదరి బాగోగులను వితికానే చూసుకుంది.అంతేకాదు దగ్గరుండి మరీ ఆమె పెళ్లి చేసింది. అలాగే తన సోదరికి జీవితాంతం గుర్తుండిపోయేలా గ్రాండ్ గా సీమంతం కూడా చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట బాగా వైరలయ్యాయి. ఇక పోతే గతేడాది డిసెంబర్ లో వితిక పెద్దమ్మగా ప్రమోషన్ పొందింది. సోదరి కృతిక షేరు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఆ చిన్నారికి నామకరణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు వితిక, కృతిక. తమ బాబుకు జైవీర్ కార్తికేయ అని నామకరణం చేసినట్లు ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇక ఎప్పటిలాగే వితిక తన చెల్లికి మరో సర్ ప్రైజ్ ఇచ్చింది. ఊయల ఫంక్షన్‌ కోసం దగ్గరుండి డెకరేషన్‌ చేయించిందట. ఇది చూసి కృతిక చాలా ఆశ్చర్యపోయిందట. ఈ వీడియో చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వితిక లాంటి అక్క దొరికినందుకు కృతిక చాలా లక్కీ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఇక వరుణ్ సందేశ్- వితిక లది ప్రేమ వివాహం. పడ్డానంటి ప్రేమలో మరి సినిమా షూటింగ్ లో వీరి పరిచయం మొదలైంది. ఆ తర్వాత అది స్నేహంగా మారింది. ఆపై ప్రేమగా చిగురించింది. పెద్దల అనుమతితో 2016లో పెళ్లిపీటలెక్కారు వరుణ్ సందేశ్ – వితిక. అయితే పెళ్లై పదేలవుతున్నా ఈ దంపతులకు సంతాన భాగ్యం కలగలేదు. ఇందుకు గల కారణాలను వరుణ్ పలు సందర్భాల్లో వెల్లడించాడు. పెళ్లైన రెండేళ్లకు అంటే  2018లో వితిక గర్భం దాల్చింది. అయితే ఆమెను దురదృష్టం వెంటాడింది. అనారోగ్య కారణాలతో ఆమెకు అబార్షన్ అయ్యింది. ఆ తర్వాత కూడా వితిక కొన్ని ఆరోగ్య సమస్యలతో సతమతమైందని చెప్పుకొచ్చాడు వరుణ్. అయితే త్వరలోనే తాము కూడా గుడ్ న్యూస్ చెబుతామని, పిల్లల కోసం ప్లానింగ్ చేస్తున్నామని ఈ హీరో పేర్కొన్నాడు.

వితిక షెరు చెల్లి నామకరణ మహోత్సవం ఫొటోలు..

 

View this post on Instagram

 

A post shared by Krithika Sheru (@krithikasheru)

సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం వరుణ్‌ సందేశ్‌- వతిక ‘ధర్మస్థల నియోజకవర్గం’, ‘డియర్‌ ఆస్ట్రోనాట్‌’ సినిమాల్లో జంటగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

వీడియో ఇదిగో..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *