Virat Kohli: 15 గంటల్లోనే 9 మిలియన్ల లైక్స్‌.. ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోన్న కోహ్లీ ‘3 పదాల’ పోస్ట్..!

Virat Kohli: 15 గంటల్లోనే 9 మిలియన్ల లైక్స్‌.. ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోన్న కోహ్లీ ‘3 పదాల’ పోస్ట్..!


Virat Kohli: భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ (Virat Kohli) కేవలం బ్యాట్‌తోనే కాదు, సోషల్ మీడియాలో తన పోస్టులతో కూడా రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా, కోహ్లీ చేసిన ఒక పోస్ట్ ఇంటర్నెట్‌లో పెను సంచలనంగా మారింది. ఆ పోస్ట్‌కు కేవలం 15 గంటల్లోనే 9 మిలియన్లకు పైగా లైక్‌లు వచ్చాయి. ఆ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది.

‘Been a minute’ అంటూ..

విరాట్ కోహ్లీ తన సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ (Anushka Sharma)తో ఉన్న ఒక అందమైన చిత్రాన్ని తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. లండన్‌లో తీసుకున్నట్టుగా ఉన్న ఈ పోస్ట్‌కు ఆయన పెట్టిన క్యాప్షన్ కేవలం మూడు పదాలు: “Been a minute” అంటే ‘‘చాలా కాలం తర్వాత..’’ అంటూ పోస్ట్ చేశాడు.

చాలా కాలం తర్వాత తన ప్రియమైన వారితో గడిపిన సందర్భాన్ని సూచిస్తూ పెట్టిన ఈ చిన్న పోస్ట్, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. కోహ్లీ, అనుష్క శర్మలు ఒకరికొకరు దగ్గరగా నవ్వుతూ ఉన్న ఈ చిత్రం క్షణాల్లో వైరల్ అయింది. ఈ పోస్ట్‌కు బాలీవుడ్ ప్రముఖులు ఆలియా భట్, అతియా శెట్టి వంటి వారు కూడా లైక్ కొట్టి, తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఇవి కూడా చదవండి

కోహ్లీ బ్రాండ్ పవర్..

అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టులు, టీ20ల నుంచి విరామించినప్పటికీ, వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతున్న కోహ్లీ బ్రాండ్ విలువ ఏమాత్రం తగ్గలేదని ఈ రికార్డు స్పష్టం చేస్తోంది. ఒక సాధారణ పోస్ట్ ఇంత పెద్ద సంఖ్యలో లైక్‌లను పొందడం, విరాట్ కోహ్లీకున్న అపారమైన ప్రజాదరణ, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను తెలియజేస్తుంది. క్రీడా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సెలబ్రిటీలలో ఒకరిగా కోహ్లీ స్థానాన్ని ఈ పోస్ట్ మరోసారి బలంగా నిరూపించింది.

ఒక చిన్న పోస్ట్, అదీ కేవలం మూడు పదాల క్యాప్షన్‌తో 9 మిలియన్లకు పైగా లైక్‌లు సాధించడం విరాట్ కోహ్లీకి మాత్రమే సాధ్యమైంది. ఈ రికార్డులు క్రికెట్ మైదానంలోనే కాకుండా, సోషల్ మీడియా వేదికగా కూడా “కింగ్ కోహ్లీ” ఆధిపత్యాన్ని చాటుతున్నాయి.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *