కొన్నిసార్లు మనం కళ్ల ముందు జరిగే సంఘటనలు చూసి ఆశ్చర్యపోతుంటాం. వాటిని అదృష్టం అనాలా.. లేక దేవుని దయ అనాలా? అనేది అర్ధం కాదు. ఇటీవల వైరల్ అవుతున్న ఒక వీడియోలో అలాంటి అద్భుతమే కనిపించింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వృద్ధుడు తన ఇంటి పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ ఉన్న ఒక ఎత్తైన గోడను పదే పదే చూస్తూ.. గోడ అవతల ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను గోడను తాకలేదు.. కానీ కేవలం కొన్ని క్షణాల్లోనే ఆ గోడ మొత్తం పేక మేడలా కూలిపోయింది.
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. గోడ కూలే సమయానికి ఆ వృద్ధుడు సడెన్‌గా వెనక్కి వెళ్లడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కేవలం కొన్ని అంగుళాల దూరంలో పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను @Dharma0292 అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ ఘటనలో ఆ వృద్ధుడు గాయపడకపోవడం నిజంగా ఒక అద్భుతమేనని అందరూ అంటున్నారు.
వృద్ధుడు ఒక్క గాయం కూడా లేకుండా సురక్షితంగా బయటపడటం చూసి నెటిజన్లు అవాక్కయ్యారు. అంతేకాదు ఎలాంటి తుఫాను లేదా ఇతర బలమైన కారణాలు లేకుండా ఎవరూ తాకని గోడ ఇలా ఒక్కసారిగా కూలిపోవడం చూసి చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఇది నిజంగా అదృష్టం, మంచి పనుల ఫలితం అని కామెంట్లు పెడుతున్నారు. ఒక నెటిజన్ జరగబోయేదాన్ని ఎవరు ఆపగలరు? ఇది దేవుని చిత్తం అని కామెంట్ చేశారు.
जाके रखो सइयां, मार सके न कोई। pic.twitter.com/CKuAOa3ieB
— DHARMA (@Dharma0292) September 21, 2025