సింహాలను అడవికే రాజు అంటారు. సింహం అంటే మిగితా జంతువులకు హడల్.. అందుకే వాటి సైడ్ కూడా వెళ్లడానికి భయపడతాయి. అయితే ఒక ఆసక్తికరమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అడవికి రాజులైన సింహాల గుంపు ఒక చిన్న గేదె దూడను వేటాడాలనుకోగా.. వాటికి దూడ తల్లి గట్టి షాక్ ఎలా ఇచ్చిందోొ చూడొచ్చు. ఇక్కడ గేదెల ఐక్యత, తల్లి ప్రేమ గెలిచాయి. సింహాల గుంపు ఒక గేదె దూడను చుట్టుముడుతుంది. సింహాలు ఆ దూడపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుండగా దాని తల్లి గేదె ధైర్యంగా వాటిని ఎదుర్కొంది. అది ఒక సింహాన్ని వెనక్కి నెట్టితే, మరో సింహం దూడ దగ్గరికి రాకుండా అడ్డుకుంది.
అదే సమయంలో సింహాలన్నీ దూడను చుట్టుముట్టడానికి ప్రయత్నించాయి. ఇప్పుడే ఆ సింహాలు కూడా ఊహించని ఘటన జరిగింది. మరికొన్ని గేదెలు అక్కడికి చేరుకుని సింహాలపై దాడికి సిద్ధమయ్యాయి. ఆ మందను చూసిన సింహాలు భయపడి అక్కడి నుంచి పారిపోయాయి. ఈ సంఘటన గేదెల మధ్య ఉన్న అద్భుతమైన ఐక్యతను చూపిస్తుంది. ఈ వీడియోను @Predatorvids అనే యూజ్ ఎక్స్‌లో షేర్ చేశారుజ ఒక తల్లి శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేసింది.
ఈ 49 సెకన్ల వీడియోను ఇప్పటివరకు లక్ష కంటే ఎక్కువ మంది చూశారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “తల్లి బలాన్ని ఎరూ ఊహించలేరు.. ఆమె సింహాలను కూడా భయపెట్టింది అని ఒకరు కామెంట్ చేయగా.. ఇవాళ సింహాలకు భోజనం దొరకలేదు” అని మరొకరు కామెంట్ చేశారు. మరికొంతమంది గేదెల ఐక్యతను, తల్లి గేదె ధైర్యాన్ని అభినందించారు. ఏదిఏమైన ఐక్యంగా ఉంటే దేనినైనా ఎదిరించవచ్చనే దానికి ఈ వీడియోనే నిదర్శనం.
A mother’s power can never be underestimate!
And friends came to their rescue. pic.twitter.com/SqUgjCsoSz
— PREDATOR VIDS (@Predatorvids) September 20, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.