వర్షాకాలం పాములు రావడం సాధారణమే. ఇంటి ఆవరణలోనో, పెరట్లోనో కనిపిస్తుంటాయి. ఒక్కోసారి ఎవరూ లేనప్పుడు ఇంటిలోకి కూడా వస్తుంటాయి. కానీ ఇక్కడో నల్లతాచు మాత్రం ఏకంగా ఓ హోటల్లోని రెండో అంతస్తులో ఉన్న టాయిలెట్ కమ్మోడోల తిష్టం వేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాయిలెట్ కమ్మోడ్లో పడగవిప్పి నల్లతాచు బుసలు కొడుతోంది.
రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాకు చెందిన ఈ వైరల్ క్లిప్ ఇంటర్నెట్ వినియోగదారులను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ సంఘటన పుష్కర్‌లోని ఒక హోటల్లోని రెండవ అంతస్తులో జరిగింది. 4 నుండి 5 అడుగుల పొడవున్న నల్లతాచు పడగవిప్పి బుసలు కొడుతూ కనిపించింది.
సమాచారం అందుకున్న వెంటనే, రాజస్థాన్ కోబ్రా బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. నల్లతాచును బంధించి అడవిలోకి సురక్షితంగా విడిచిపెట్టబడిన తర్వాత స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. వర్షాకాలంలో పాములు అపార్ట్మెంట్లలోకి, ముఖ్యంగా గ్రామాల్లోని ఇళ్లల్లోకి వస్తుంటాయని, కాని ఇలా టాయిలెట్ కమ్మోడ్లోకి రావడం ఆశ్చర్యంగా ఉందని స్థానికులు తెలిపారు.
వీడియో చూడండి:
Pushker के एक Hotel कमोड से निकला 5 फीट लंबा Cobra | Ajmer | Cobra Snake | Viral |#Ajmer #Rajasthan #Cobra #CobraSnake #Snake pic.twitter.com/qTPLR6Ubzj
— भारत की बात (@Bharatkebat) September 20, 2025
వైరల్ వీడియోను ఇప్పటివరకు వేలాది మంది వీక్షించారు. ఈ సంఘటన నెటిజన్స్‌ను భయభ్రాంతులకు గురిచేసింది. అది లోపలికి ఎలా వచ్చింది, అది కూడా 2 అంతస్తుల హోటల్లోకి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇది చూసిన తర్వాత నేను ఎప్పుడూ భయపడుతూనే ఉంటాను అంటూ మరికొందరు పోస్టు పెట్టారు.