
సాధారణంగా బీట్రూట్ దుంపలు ఎంత సైజు ఉంటాయి.. మహా అంటే ఒక్క దుంప అరకేజీ బరువు తూగుతూ కొంచెం ఆశ్చర్యపరుస్తాయి. కానీ అంతకు మించిన ఘటన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమజిల్లాలో జరిగింది. ఇక్క ఓ రైతు పండించిన బీట్రూట్ దుంపలు ఏకంగా ఒక్కోటి రెండున్నర కిలోలు తూగుతోంది. ‘బాహుబలి’ సైజులో దర్శనమిస్తున్న ఈ బీట్రూట్ దుంపలు మామిడికుదురు మండలం మొగలికుదురులో హాట్ టాపిక్‌గా మారాయి. చిన్న సైజు కొబ్బరి బొండాలను తలపిస్తున్న ఈ దుంపలను చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. స్థానిక కూరగాయల వ్యాపారి వుర్రింక రాఘవ దగ్గర ఈ భారీ బీట్రూట్లు కనిపించాయి. ఇవి కర్ణాటకలోని కోలార్ ప్రాంతం నుండి దిగుమతి అయినట్లు ఆయన తెలిపారు. సాధారణంగా మార్కెట్లో దొరికే దుంపల కంటే ఇవి ఐదు రెట్లు ఎక్కువ బరువు ఉండటంతో, కొనుగోలుదారులు, తోటి వ్యాపారులు వీటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇంత భారీ పరిమాణంలో బీట్రూట్లు పెరగడంపై రాజోలు ఉద్యానశాఖ అధికారి దిలీప్ కుమార్ స్పందించారు. వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలించినప్పుడు, నేలలోని పోషకాలు సమృద్ధిగా అందినప్పుడు దుంప జాతి కూరగాయలు ఇలా అసాధారణ రీతిలో బరువు పెరిగే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. ఈ ‘బాహుబలి’ బీట్రూట్ల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూరగాయల మార్కెట్లో ఒకేసారి ఇంత పెద్ద దుంపలు కనిపించడంతో అంతా “వావ్” అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చదువుకున్న కోడలు కావాలి.. కానీ ఉద్యోగం చేయొద్దు !! మ్యాట్రిమోనియల్ పోస్ట్ వైరల్
చెరువుగట్టుపై భయానక దృశ్యం.. భయంతో వణికిపోయిన జనం
అద్భుతం.. మూగజీవికి పునర్జన్మ.. ప్రాణం నిలిపిన సీపీఆర్