కోల్‌కతాలో జోరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో కొన్ని ప్రాంతాలు జల దిగ్భందంలో కూరుకుపోయాయి. కోల్‌కతాలో వర్షాలు, నీటమునిగిన వీధులు.. ఇలాంటి సందర్భాల్లో ఏదో ఒకటి వింతగా జరగడం సహజమే. కానీ తాజాగా బయటకు వచ్చిన ఓ వీడియో చూసి నెటిజన్లను ఆకట్టుకుంటుంది. పాములు చేపలు తినడం కొత్తేమీ కాదు. కానీ ఈ సారి సీన్‌లోని ట్విస్ట్ వేరే.
నీటమునిగిన ఓ ఇంటి వెనుకభాగంలో పాము ఒక పెద్ద చేపను నోట్లో పట్టుకుని సుడిగాలి వేగంతో పారిపోతూ కనిపించింది. ఆ వీడియోలో పాము మెరుపు వేగంతో.. తొందరగా జారిపోతూ, తన వేటను గట్టిగా నోట్లో పట్టుకుని ఉన్న దృశ్యం అందర్నీ ఆకట్టుకుంటుంది.
ఫిష్ అంటే పడి చచ్చిపోయే.. బెంగాలీల స్టేట్‌లో.. పాముకి కూడా చేపలంటే ఇంత ఇష్టం అని చెప్పేలా ఆ సీన్ ఉందని చాలామంది జోకులు పేల్చారు. “కోల్‌కతా ఫ్లడ్ పర్క్స్, డుర్గాపూజకు ముందు సర్‌ప్రైజ్” అంటూ పోస్ట్ చేసిన వీడియో కాసేపట్లోనే వైరల్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటివరకు 3.26 లక్షలకుపైగా రియాక్షన్లు వచ్చాయి.
“స్నేక్ కూడా బెంగాలీ అయ్యిందిరా!” అంటూ ఒకరు కామెంట్ పెట్టారు. “బ్రో ప్రూవ్ చేసేశాడు.. హీ ఈజ్ ట్రూ బెంగాలీ! ఇంత అందమైన పాము నేను ఎప్పుడూ చూడలేదు,” అంటూ ఇంకొకరు కామెంట్ చేశారు.
ఇకపోతే, గత కొద్ది రోజులుగా కోల్‌కతాలో కుండపోత వర్షాలు కురుస్తుండడంతో నగరం పూర్తిగా నీటమునిగిపోయింది. దుర్గాపూజ పండుగకు కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా వచ్చిన ఈ వరదలు ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేశాయి. అయితే ఈ వింత సన్నివేశం మాత్రం సోషల్ మీడియాలో అందరినీ పగలబడి నవ్విస్తోంది.
మరిన్ని వైరల్ వీడియో న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..