Viral Video: రోడ్డు గుంతల అద్భుతం.. చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు

Viral Video: రోడ్డు గుంతల అద్భుతం.. చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు


Viral Video: రోడ్డు గుంతల అద్భుతం.. చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు

రోడ్లపై గుంతలు ప్రాణాలు తీస్తాయని తెలుసు, కానీ అవే గుంతలు పోయిన ప్రాణాన్ని తిరిగి తెస్తాయని ఎవరైనా ఊహించగలరా? ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఆ విచిత్రం జరిగింది. ఫిలిబిత్‌కు చెందిన వినీత శుక్లా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స అందించినా ఆమె స్పృహ‌లోకి రాలేదు. వైద్యానికి ఆమె స్పందించకపోవడంతో పరీక్షించిన డాక్టర్లు ‘బ్రెయిన్ డెడ్’ అని ప్రకటించారు. ఇక ఆశలు వదులుకున్న కుటుంబ సభ్యులు, కన్నీరుమున్నీరుగా విలపిస్తూ అంత్యక్రియల కోసం ఆమెను అంబులెన్స్‌లో ఫిబ్రవరి 24న ఇంటికి తీసుకెళ్తున్నారు. అంతా అయిపోయింది అనుకుంటున్న తరుణంలో బరేలీ-హరిద్వార్ 74వ జాతీయ రహదారిపై ఆ అంబులెన్స్ వెళ్తుండగా.. హఫీజ్‌గంజ్ వద్ద ఒక భారీ గుంతలోకి దిగి, భారీ కుదుపునకు గురైంది. ‘బ్రెయిన్ డెడ్’ అయిన మహిళలో చలనం వచ్చింది. ఆమె ఊపిరి తీసుకోవడం గమనించిన భర్త కులదీప్ కుమార్ శుక్లా షాకయ్యారు. వెంటనే మళ్లీ ఆసుపత్రికి తరలించారు. క్రిటికల్ మెడికల్ కేర్‌లో చికిత్స తర్వాత పూర్తిగా కోలుకున్న ఆమెను సోమవారం డిశ్చార్జ్ చేశారు. కోమాలో నుంచి బయటపడటమే కాదు తమతో మాట్లాడుతోందని కుటుంబం సంతోషం వ్యక్తం చేశారు. న్యూరోసర్జన్ మాట్లాడుతూ ఆమె మెదడు కండరాల్లో ప్రతిస్పందన కనిపించలేదని, సాధారణంగా 15 పాయింట్లు ఉండే ఆమె గ్లాస్గో కోమా స్కేల్ 3కి పడిపోయిందన్నారు. ఇది బ్రెయిన్ డెడ్‌కు సంకేతమని అన్నారు. నిర్దారణ పరీక్షల్లో మైడ్రియాసిస్ అంటే కళ్లు గుండ్రంగా తిరగడం కనిపించలేదని, మెదడు సంకేతాలు నిలిచిపోయాయని సూచించే లక్షణమని చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నానో కారులో.. దేశాన్ని చుట్టేస్తున్న 75 ఏళ్ల కుర్రాడు.. అదృష్టం ఉండాలి

సిలిండర్ బుకింగ్‌పై మారిన నిబంధనలు.. తప్పక తెలుసుకోండి

ఇంటర్నెట్ వినియోగదారులకు షాక్.. ఇకపై వారు ‘డేటా ట్యాక్స్’ కట్టాల్సిందే !

Hyderabad: హైదరాబాద్‌లో.. కట్టెలు, బొగ్గులకు ఫుల్ డిమాండ్‌ !!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *