సాధారణంగా పాములకు భయపడని వారు ఉండరు. అక్కడ పాము కనిపించిందంటే ఇక్కడి నుంచే జారుకుంటారు. ఇక నల్లతాచు వంటి పాములు కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు పోవడం ఖాయం. నల్లతాచు అత్యంత విషపూరితమైనదిగా చెబుతారు. అంతేకాదు మిగతా పాములకన్నా నల్లతాచు అత్యంత చురుకుగా ఉంటుంది. వేగంగా కదలడం.. వేగంగా కాలే పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విరివిగా వైరల్ అవుతుంటాయి. పాముల్లో కెల్లా నల్లతాచు అత్యంత ప్రమాదకరమైనది చెబుతారు. ఎంత వేగంగా కదులుతుంతో అంతే వేగంగా కాటేస్తుంది. అందుకే కోబ్రాతో కాస్తా జాగ్రత్తగా ఉంటారు.
ప్రస్తుతం కోబ్రాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బసలు కొట్టే కోబ్రాను ఓ వ్యక్తి చాలా ఈజీగా బాటిల్లో వేయడం ఆ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్స్ చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కోబ్రాను బుట్టలో వేయడం ఇంత ఈజీనా ఆంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ వ్యక్తి చాలా అనుభవం ఉన్న స్నేక్ క్యాచర్ అయి ఉంటాడని మరికొంత మంది పోస్టులు పెడుత్నారు.
వీడియోలో కోబ్రా తన పడగ విప్పి బసలు కొడుతూ కనిపిస్తుంది. ప్రత్యేక సూట్ ధరించిన ఓ వ్యక్తి పాము ఒక ప్లాస్టిక్ డబ్బాతో ఉన్నాడు. నేల మీద ఉన్న పామును వద్దకు బాటిల్‌ను తీసుకెళతాడు. పామును ఆ బాటిల్లో బంధించడం అతని ఉద్దేశంగా కనిపిస్తుంది. అయితే ఆ పాము మాత్రం తొలుత బాటిల్లోకి వెళ్లడానికి ససేమిరా అన్నట్లుగా ఉంటుంది. ఆ వ్యక్తి బాటిల్‌ను పాము పడగ దగ్గరకు తీసుకెళతాడు. పాము తలను బాటిల్ రంద్రలోకి కొంత భాగాన్ని తీసుకెళతాడు. ఆ తర్వాత పాము ఆటోమెటిక్‌గా బాటిళ్లోకి దూరుతుంది. కోబ్రా ప్లాస్టిక్ డబ్బాలోకి వెళ్లాక కూడా పడగ విప్పి బుసలు కొట్టడం కనిపిస్తుంటుంది.
వీడియో చూడండి:
This method of catching a cobra 😳 pic.twitter.com/IBsQTejtza
— Interesting As Fuck (@interesting_aIl) September 22, 2025
ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.