అడవిలో ఏ క్షణం ఏం జరుగుతుందనేది చెప్పలేం. సింహాలు, పులులు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయే తెలీదు. అందుకే జీవులన్నీ చాలా అప్రమత్తంగా ఉంటాయి. తాజాగా ఒక సింహం, మొసలి మధ్య చిక్కుకున్న జీబ్రాకు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసేవారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియోలో, ఒక సింహం జీబ్రాను వేటాడింది. ఆ జీబ్రా తన ప్రాణాలను రక్షించుకోవడానికి చాలా కష్టపడింది. చివరికి అది ఒక నది దగ్గరికి చేరుకోగా.. సింహం పట్టు సడలడంతో, జీబ్రా నదిలోకి దూకింది. ఈ క్షణం జీబ్రా బతికిపోయిందని అంతా అనుకున్నారు. కానీ అసలు కథ అప్పుడే మొదలయ్యింది.
మొసలి గుంపు దాడి
జీబ్రా నదిలో పడిన వెంటనే మొసళ్ల గుంపు దానిపై దాడి చేసింది. జీబ్రా తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా, దాని ప్రయత్నాలు విఫలమయ్యాయి. మొసలి పట్టు చాలా బలంగా ఉండడంతో అది తప్పించుకోలేకపోయింది. చివరికి మొసళ్లు దానిని వేటాడి తినేశాయి. ఈ భయంకరమైన దృశ్యం చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు.
వైరల్ వీడియో
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో wildfriends_africa అనే ఐడీతో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 30 లక్షల మందికిపైగా వీక్షించారు. 11 వేలకు పైగా లైకులు, కామెంట్లు వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు “ఇది నిజమైన యుద్ధం, ఇక్కడ మరణంతో పోరాడాలి” అని కామెంట్లు చేశారు. మరొక యూజర్ “సింహం నుంచి తప్పించుకుని మొసలికి చిక్కింది” అని పోస్ట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..