Viral Video: ఇంత భయానకమైన స్టంట్ మీరు ఎప్పుడైనా చూశారా? ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్న వీడియో..!

Viral Video: ఇంత భయానకమైన స్టంట్ మీరు ఎప్పుడైనా చూశారా? ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్న వీడియో..!


సోషల్ మీడియా పుణ్యామాని రకరకాల విన్యాసాలతో ఫేమస్ కావాలనుకుంటారు. ఈ క్రమంలోనే ఈ ప్రపంచంలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకరమైన విన్యాసాలు చేసేవారికి కొదవ లేదు. అలా చేయడం వల్ల తమ ప్రాణాలే పోతాయని కూడా వారు పట్టించుకోరు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన జనానికి ఒక్కసారిగా ఊపిరి ఆగినంత పనైంది. ఈ వీడియోలో, ఒక వ్యక్తి ప్రమాదకరమైన జలపాతంలో పడవ ప్రయాణం చేశాడు. బలమైన నీటి ప్రవాహం, ఎత్తు నుండి పడవలో ప్రయాణం, కింద ఉన్న సుడిగుండం చూసేవారిని వణికిపోయేలా చేసేలా ఉంది ఆ దృశ్యం.

ఒక భారీ జలపాతం కిందకు దూకుతోంది. జలపాతాన్ని చూస్తే, పై నుంచి పడితే, బతికే అవకాశాలు చాలా తక్కువ అని ఎవరైనా అనుకోవచ్చు. అయితే, ఒక వ్యక్తి ఇది తప్పని నిరూపించాడు. పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు, అతను నేరుగా జలపాతంలోకి దూకి అదృశ్యమయ్యాడు. మొదట, అతను మునిగిపోయినట్లు అనిపించింది, కానీ కొన్ని సెకన్ల తర్వాత, అతను నీటి నుండి బయటకు వచ్చినప్పుడు, అందరూ ఆశ్చర్యపోయారు. కొన్ని సెకన్ల ఈ పోరాటం ఉత్కంఠభరితమైనది. భయానకమైనది. ఈ ప్రమాదకరమైన స్టంట్ చేస్తున్న వ్యక్తి పేరు డాన్ జాక్సన్. అతను తరచుగా ఇటువంటి ప్రమాదకరమైన స్టంట్‌లు చేసే అథ్లెట్‌గా మంచి పేరుంది. ఈ భయానక వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో danejacksonkayak అనే ఖాతా షేర్ చేశారు. ఈ 14 సెకన్ల వీడియోను 58,000 కంటే ఎక్కువ సార్లు వీక్షించారు, వందలాది మంది దీన్ని లైక్ చేసి, రకరకాల ప్రతిస్పందనలు వ్యక్తం చేస్తున్నారు.

వీడియోను ఇక్కడ చూడండిః

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *