
నిజంగా మీ లైఫ్ చాలా దారుణంగా ఉందని భావిస్తున్నారా..? లేనిపోని కష్టాలు అన్నీ మీకే ఉన్నాయని నిరాశ చెందుతున్నారా..? ఒక్కసారి పైన స్క్రీన్ షాట్ చూడండి. అతనికి మాటలు రావు.. మనం చెప్పేది కూడా వినపడదు.. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుగా సాగుతున్నాడు. అలా ఉండి కూడా ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తూ తన కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. అతని స్క్రీన్ షాట్‌ను స్తుతీ అనే యూజర్ నెట్టింట షేర్ చేయడంతో ట్రెండ్ అవుతోంది. లక్షల మంది ఈ పోస్ట్ చూసి స్పందిస్తున్నారు. ఆ ఫుడ్ డెలివరీ బాయ్ ఆత్మస్థైర్యాన్ని అందరూ కొనియాడుతున్నారు. ఫ్యామిలీ కోసం మగవాళ్లు పడే శ్రమ అంటూ ఆమె ఈ పోస్ట్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు.
అందులో ‘నేను మీ ఆర్డర్ తీసుకున్నాను. కొద్దిసేపట్లో డెలివరీ చేస్తాను. నాకు వినపడదు, మాట్లాడలేను. అడ్రెస్ వద్దకు వచ్చాక మెసేజ్ చేస్తాను. దయచేసి చూడండి’ అని ఆ డెలివరీ బాయ్ కస్టమర్‌కు మెసేజ్ పంపినట్లు ఉంది. ఈ పోస్ట్‌పై ఓ నెటిజన్ స్పందిస్తూ… ‘మనం పని మానేయడానికి కారణాలు వెతుక్కుంటాం. అతను విధికి ఎదురీదుతున్నాడు. ఇలాంటి వారికి కాస్త టిప్ ఇస్తే ఉపయోగపడుతుంది’ అని కామెంట్ చేశారు. ‘ఎదురీత ముందు విధిరాత ఎంతో’ అని మరో యూజర్ వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్‌పై మీ అభిప్రయాన్ని కూడా తెలియజేయండి..
Things men do for their family! pic.twitter.com/pMsYXNodH8
— Stutii (@Sam0kayy) September 25, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..