
మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాలో సోమవారం రాత్రి షాకింగ్ ఘటన వెలుగుచూసింది. జిల్లాలోని ఫత్యపూర్ గ్రామంలో మనోరమ రాథోడ్ అనే మహిళ.. మేకలను పెంచేది. వాటిలోని ఓ మేక రెండు పిల్లలకు జన్మనివ్వడంతో.. వాటిని వాటిని ప్లాస్టిక్ ట్రేలో పెట్టి నిద్రకు ఉపక్రమించింది. అయితే కొంతసేపటి తర్వాత వాటికి పాలు పట్టించేందుకు లేవగా.. ఆ రెండు మేక పిల్లలు కనిపించలేదు. దీంతో ఆమె తన మేక పిల్లల్ని ఎవరో దొంగిలించారని భావించి.. కేకలు వేయడం ప్రారంభించింది. ఈ లోపు చుట్టూ చూస్తుండగా.. దాదాపు 10 అడుగుల పొడవైన కొండచిలువ.. పొట్ట ఉబ్బి కదల్లేని పరిస్థితుల్లో అక్కడ కనిపించింది. దీంతో గ్రామస్థులు సాయంతో స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చింది. అతను వచ్చి జాగ్రత్తగా ఆ కొండచిలువను బంధించాడు.
కాగా దాన్ని తీసుకెళ్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచేపెట్టే క్రమంలో.. ఆ కొండచిలువ మెడను గట్టిగా పట్టుకున్నాడు ఆ స్నేక్ క్యాచర్. దీంతో అది మింగిన రెండు మేక పిల్లలను బయటకు కక్కేసింది. ఆపై కొండచిలువ సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. నర్మదా నది వెంబడి అడవులు ఉండటం వల్ల.. పాములు ఇలా నివాస ప్రాంతాల్లోకి వచ్చి జీవాలను వేటాడుతున్నాయి. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ సలహా ఇస్తోంది.
View this post on Instagram
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..