ఇలాంటి మనుషులు కదా ఈ సొసైటీకి కావాల్సింది. అతనో ర్యాపిడో డ్రైవర్. ప్యాసింజర్‌ను ఎక్కించుకుని.. సేఫ్‌గా గమ్యస్థానానికి తీసుకెళ్లడం అతని పని. అయితే ఈ వ్యక్తి కేవలం ర్యాపిడో డ్రైవర్‌గా మిగిలిపోలేదు.. ఓ మంచి మనిషిగా తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. కారణం.. అతను లేడీ ప్యాసింజర్‌ను డ్రాప్ చేసిన తర్వాత.. అర్థరాత్రి కావడంతో ఆమె ఫ్లాట్ మేట్ తిరిగి వచ్చే వరకు తనకు తోడుగా ఉన్నాడు. ఈ విషయాన్ని ఆ యువతి నెటిజన్లతో పంచుకుంది. మానవత్వం ఇంకా బతికే ఉందని చెప్పుకొచ్చింది.
సదరు యువతి గర్బా నైట్‌కు వెళ్లి తిరిగి వచ్చింది. దాదాపు అర్ధరాత్రి అయింది. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. అయితే తన ఫ్లాట్ మేట్ దగ్గర రూమ్ కీస్ ఉన్నాయి. ఆమె ఇంకా రాకపోవడంతో.. ఈ యువతికి ఏం చేయాలో అర్థం కాలేదు. పరిస్థితి అర్థం చేసుకున్న ర్యాపిడో డ్రైవర్.. ఆమె రూమ్ మేట్ వచ్చేవరకు వేచి ఉంటానని చెప్పడంతో.. ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనైంది. అతన్ని ప్రశంసిస్తూ వీడియో రికార్డు చేసింది. ఈ క్లిప్‌ను మొదట శివానీ శుక్లా సెప్టెంబర్ 26న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నిజమైన మగవాళ్లు చేసే పని ఇదే అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. “ఇలాంటి వ్యక్తి ప్రపంచంలోని అన్ని ఆనందాలు, విజయాలకు అర్హుడు” అని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి.