Vijay,Rashmika: తెలుగు స్టేట్స్‌కు ఓ కొత్త కోడలు వచ్చింది.. మంచిగా చూస్కోండి: విజయ్ దేవరకొండ

Vijay,Rashmika: తెలుగు స్టేట్స్‌కు ఓ కొత్త కోడలు వచ్చింది.. మంచిగా చూస్కోండి: విజయ్ దేవరకొండ


విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం ఫిబ్రవరి 26న గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. విజయ్ రష్మిక పెళ్లి చేసుకోవడంతో అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. ఇక పెళ్లి తర్వాత ఈ జంట విజయ్ సొంత ఊరులో సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. అలాగే ఊరి ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేశారు. అలాగే పలు దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఇక విజయ్, రష్మిక పెళ్ళికి కొద్ది మంది అతిధులు మాత్రమే హాజరయ్యారు. ఇక ఈ రోజు(మార్చి 4)న హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు అభిమానులు, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.

750 సినిమాల్లో నటించిన లెజెండ్.. కమెడియన్ ఏవీఎస్ అల్లుడు తెలుగులో తోప్ యాక్టర్..

ఈ వేడుకలు సినీ సెలబ్రెటీలతో పాటు అభిమానులు కూడా భారీగా హాజరు కానున్నారు. ఈ క్రమంలో అభిమానులకు విజయ్, రష్మిక ఓ విజ్ఞప్తి చేశారు. పోలీసుల ఆంక్షల కారణంగా ఆహ్వానం లేకుండా అతిధులు రావద్దు అంటూ అభిమానులకు రిక్వెస్ట్ చేశారు. ఇక ఈ రిసెప్షన్ కు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ రష్మిక మీడియాతో ముచ్చటించారు.

ఇవి కూడా చదవండి

మీరంతా వెళ్లి కండోమ్‌లు ప్రచారం చేసుకోండి.. నెటిజన్‌పై రెచ్చిపోయిన యాంకర్ రష్మీ

ఈ ప్రెస్ మీట్ లో విజయ్ మాట్లాడుతూ.. తెలుగు స్టేట్స్ కు కొత్త కోడలు వచ్చింది మంచిగా చూసుకోండి అని సరదాగా అన్నారు. అలాగే రష్మిక మాట్లాడుతూ.. లైఫ్ లో ఫస్ట్ టైం ఓ పెద్ద స్టెప్ తీసుకుంటున్నాం.. మీ ఆశీర్వాదాలు కావాలి అని కోరింది.

Actress Neha: 8 నెలలు మంచంపైనే.. నరకం అనుభవించా..! కన్నీళ్లు పెట్టుకున్న స్నేహ

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *