Vijay Thalapathy Sangeetha : ఎన్నికల ముందు విజయ్ దళపతికి షాకిచ్చిన భార్య.. అసలు సంగీత బ్యాగ్రౌండ్ తెలుసా.. ?

Vijay Thalapathy Sangeetha : ఎన్నికల ముందు విజయ్ దళపతికి షాకిచ్చిన భార్య.. అసలు సంగీత బ్యాగ్రౌండ్ తెలుసా.. ?


తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతున్నాడు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్నాళ్లు హీరోగా మెప్పించిన విజయ్.. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సొంతంగా టీవీకే పార్టీని స్థాపించి.. అటు సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. కొన్ని రోజులుగా రాజకీయ ప్రచారాల్లో పాల్గొంటున్న విజయ్.. ఇప్పుడు వ్యక్తిగత విషయాలతో వార్తలలో నిలిచారు. ఆయన భార్య సంగీత స్వర్ణలింగం తాజాగా విడాకులు కావాలంటూ చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తన భర్తకు ఓ నటితో అక్రమ సంబంధం ఉందని.. రెండేళ్లుగా తాము దూరంగానే ఉంటున్నామని వెల్లడించింది. దీంతో ఇప్పుడు సంగీత పేరు మారుమోగుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‏ను ఊపేసిన ఫోక్ సాంగ్..

విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం.. లండన్ లో స్థిరపడిన శ్రీలంక తమిళ పారిశ్రామికవేత్త కుమార్తె. 1996లో వచ్చిన పూవే ఉనక్కాగా సినిమా చూసి ఆమె విజయ్ కు వీరాభిమానిగా మారింది. లండన్ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలోనే ఆమె విజయ్ కు అనేక లేఖలు రాసింది. అతడిని కలవడం కోసమే లండన్ నుంచి చెన్నై వచ్చింది. షూటింగ్ సెట్ లో విజయ్ ను కలిసి అభినందనలు తెలిపింది. ఆ సమయంలో వీరిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరు పెద్దల సమక్షంలో 1999 ఆగస్ట్ 25న పెళ్లి చేసుకున్నారు. వీరికి బాబు, పాప ఉన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..

సంగీత.. మీడియాకు దూరంగా ఉంటుంది. అలాగే ఆమె సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ గా ఉండరు. నివేదికల ప్రకారం సంగీత రూ.400 కోట్ల విలువైన ఆస్తులకు వారసురాలు అని తెలుస్తోంది. చాలా కాలంగా విజయ్, సంగీత మనస్పర్థలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె విడాకులకు అప్లై చేయడంతో ఈ వార్తలు నిజమే అని సమాచారం.

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *