Vijay Thalapathy : ఎన్నికల ముందు విజయ్‏కు మరో ఎదురుదెబ్బ.. అటు భార్య విడాకులు.. ఇంతలోనే కొడుకు సంచలన నిర్ణయం..

Vijay Thalapathy : ఎన్నికల ముందు విజయ్‏కు మరో ఎదురుదెబ్బ.. అటు భార్య విడాకులు.. ఇంతలోనే కొడుకు సంచలన నిర్ణయం..


కోలీవుడ్ విజయ్ దళపతికి ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. సినీరంగంలో దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో చక్రం తిప్పారు. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాప్ హీరోలలో విజయ్ ఒకరు. ఇన్నాళ్లు హీరోగా మెప్పించిన విజయ్.. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సొంతంగా టీవీకే పార్టీని స్థాపించి.. అటు రాజకీయా ప్రచారాల్లో పాల్గొంటున్నాడు. మరోవైపు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో విజయ్ దళపతికి అతడి భార్య సంగీత షాకిచ్చింది. తన భర్తతో విడాకులు కోరుతూ చెంగల్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నివేదికల ప్రకారం ఆ పిటిషన్ లో తన భర్తకు ఒక నటితో ఎఫైర్ ఉందంటూ.. తామిద్దరం రెండేళ్లుగా విడి విడిగా ఉంటున్నట్లు వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..

విజయ్ నుంచి విడాకులు కావాలంటూ సంగీత కోర్టును ఆశ్రయించడం యావత్ భారతీయ సినీపరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల ముందు విజయ్ పర్సనల్ విషయాలు బయటకు రావడంతో ఇప్పుడు ఇదే విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. విజయ్ ఏ నటితో ప్రేమలో ఉన్నాడంటూ నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటివరకు విజయ్ స్పందించలేదు.

ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..

ఇదిలా ఉంటే.. మరోవైుపు విజయ్ దళపతికి తనయుడు జాసన్ సైతం తన తండ్రికి షాకిచ్చినట్లుగా తెలుస్తోంది. ఓవైపు తన తల్లి విడాకులు కోరడంతో జాసన్ తన తండ్రి విజయ్ ను ఇన్ స్టాలో అన్ ఫాలో చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు జాసన్ ఫాలోయింగ్ లిస్టులో విజయ్ దళపతి పేరు లేకపోవడంతో అదే స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు నెటిజన్స్. ఇప్పుడు ఈ విషయం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. అయితే జాసన్ తన తండ్రిని అన్ ఫాలో చేయడం నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది. తండ్రి బాటలో హీరోగా కాకుండా దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయ్యాడు జాసన్. సందీప్ కిషన్ హీరోగా తన తొలి ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..

Jason Sanjay

Jason Sanjay

ఎక్కువ మంది చదివినవి : Tollywood : రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‏తో చిరంజీవి లైఫ్ మారిపోయింది.. టాలీవుడ్ నటుడు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *