Vijay- Rashmika wedding : కొడవ సంప్రదాయంలో రష్మిక విజయ్ పెళ్లి.. నెట్టింట నేషనల్ క్రష్ వీడియో వైరల్..

Vijay- Rashmika wedding : కొడవ సంప్రదాయంలో రష్మిక విజయ్ పెళ్లి.. నెట్టింట నేషనల్ క్రష్ వీడియో వైరల్..


టాలీవుల్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరి వివాహం గురువారం ఉదయం ఉదయ్ పూర్ లోని ఐటీసీ హోటల్లో జరగింది. ఈ పెళ్లికి సినీప్రముఖులు, సన్నిహితులు హాజరైనట్లు సమాచారం. ఈ పెళ్లికి పూర్తి ప్రైవసీగా నో ఫోన్ పాలసీని సైతం అమలు చేశారు. ఇక మార్చి 4న హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉంటే.. గురువార రష్మిక, విజయ్ మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. ఉదయం తెలుగు సంప్రదాయంలో వివాహం జరగ్గా.. సాయంత్రం కర్ణాటకలోని కొడవ పద్ధతిలో పెళ్లి చేసుకోకున్నారు. కర్ణాటకలోని కొడగు (కూర్గ్ ) జిల్లాలో జన్మించింది రష్మిక. అక్కడి స్థానిక వారియర్ కమ్యూనిటీనే కొడవగా పిలుస్తారు. ఈ వర్గానికి చెందిన ప్రజల ఇళ్లల్లో పెళ్లిళ్లు ఎలా జరుగుతాయో తెలుసా ? అని సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‏ను ఊపేసిన ఫోక్ సాంగ్..

కొడవ ప్రజల సంస్కృతి, ఆహార్యం, వివాహ పద్దతులు ఇతరులతో పోలిస్తే విలక్షణంగా ఉంటాయి. యువతీయువకులు తమ వర్గ సంప్రదాయాలు పాటిస్తూ పూర్వీకులను గౌరవిస్తూ పెళ్లి చేసుకుంటారు. మాములుగా జరిగే హిందూ వివాహాలకు భిన్నంగా కొడవ వెడ్డింగ్ ఉంటుంది. అగ్నీసాక్షిగా ఏడడుగులు నడుస్తూ ప్రమాణాలు చేసుకోవడం వంటిది ఏమీ ఉండదు. సుదీర్ఘంగా పెళ్లి మంత్రాలు వినిపించావు. ఈ ప్రక్రియ మొత్తంలో స్థానికతే కనిపిస్తుంది. అరటి ఆకుల్లో విందు, సంప్రదాయ అలంకరణలు ఈ ప్రత్యేక ఆకర్ణగా నిలిచాయి. ఈ వేడుకలో కుప్పుస దుస్తులు, తలపాగ ధరించనున్నారు. యోధ సంప్రదాయానికి చిహ్నంగా పీచే కట్టి అనే కత్తి ధరించడం ముఖ్య ఆచారం. వధువు కోర్గి శైలిలో చీర కట్టడం ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తుంది.

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..

కొవడ మహిళలు తమ పైటకొంగును వెనక నుంచి ముందుకు వేస్తారు. ఇక వేడుక అంతా వలగ డ్రమ్ బీట్స్, పాటలతో వారియర్ నేపథ్యాన్ని గుర్తుచేసే నృత్యాలతో ఎలాంటి ఆర్భాటం లేకుండా సందడిగా సాగుతుంది. అలాగే గన్ సెల్యూట్స్ కూడా ఆ వేడుకలో భాగమే. అయితే ఇప్పుడు దానిని అనుసరించడం క్రమంగా తగ్గిపోతుంది. ఈ క్రమంలోనే గతంలో కొడవ పద్దతిలో రష్మిక మంట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *