Vijay-Rashmika Marriage: 9 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పడిన వేళ.. విరోషి పెళ్లి ఆనందభరితం

Vijay-Rashmika Marriage: 9 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పడిన వేళ.. విరోషి పెళ్లి ఆనందభరితం


అప్పుడెప్పుడో గీత గోవిందం సినిమాలో కెమెరా ముందు… సినిమా కోసం జరిగిన సన్నివేశాలన్నీ, ఇప్పుడు విజయ్‌ దేవరకొండ – రష్మిక కళ్ల ముందు గిర్రున తిరుగుతున్నాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ, అగ్నిసాక్షిగా మూడు ముళ్లు పడ్డ తర్వాత ఏడడుగులు నడిచిన అనుభూతిని ఆస్వాదిస్తోందీ నవ జంట. అత్యంత ఆత్మీయుల మధ్య జరిగిన మూడు ముళ్ల వేడుక ఇవాళ ఉదయం 11.30దాకా సాగింది. పెళ్లి తంతు పూర్తవగానే ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమంటోస్‌ హోటల్‌ దగ్గరున్న మీడియాకు స్పెషల్‌ గా స్వీట్‌ బాక్సులు పంచి పెట్టింది విరోష్‌ పెళ్లి టీమ్‌. 2018లో మొదలైన పరిచయం.. 2019లో ప్రేమగా మారిన తరుణం.. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకరికోసం మరొకరు నిలుచుని ఒడుదొడుకులను ఎదుర్కొన్న వైనం.. ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన శుభదినం అంటూ విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి వేడుకకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి నెట్టింట్లో. మూడు రోజుల పెళ్లి.. 80ల్లో జరిగే పెళ్లిని తలపించే పెళ్లి…సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూనే, ఆధునికతను మేళవించిన పెళ్లి, హోలీ – హల్దీని కలగలిపిన పెళ్లి, ఆత్మీయుల ఆనందాలకు ఏమాత్రం లోటులేకుండా విందులూ, వినోదాలను ఏర్పాటు చేసిన పెళ్లి అంటూ అక్కడి విషయాలను విన్నవారు, బ్లర్డ్ ఫొటోల్లో చూసిన వారూ తోచినంత చెప్పుకుంటూనే ఉన్నారు. మూడు రోజులుగా ఆనందంగా సాగుతున్న వివాహ వేడుక ఈ రోజు సాయంత్రం కొడవ సంప్రదాయంలో జరిగే వివాహ తంతుతో పూర్తవుతుంది. అరటి బోదెలను నరుక్కుంటూ వరుడు వివాహ వేదికకు రావడం, అక్కడ తన కోసం ఎదురుచూస్తున్న వధువును మనువాడటం కొడవ సంప్రదాయంలో ప్రత్యేకత. తెలుగు సంప్రదాయం ప్రకారం వైవాహిక తంతును పూర్తి చేసుకున్న నూతన వధూవరులు మరోసారి కొడవ తరహా పెళ్లి కోసం కలలు కంటున్నారు. ఓ వైపు జపనీస్‌ వంటలతోనూ, మరోవైపు అరిటాకు భోజనాలతోనూ కడుపు నిండిన అతిథులు.. కొడవ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిలో కొత్తజంటను కళ్లారా చూసి ఆనందించారు. తెలుగు సంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్లిలో రష్మిక పట్టుచీర కట్టుకున్నారు. సాయంత్రం జరిగే పెళ్లిలో కొడవ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా వస్త్రాలను ఎంపిక చేసుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bigg Boss Emmanuel: బిగ్ బాస్‌ ఓటమిని తలుచుకొని.. కన్నీళ్లు పెట్టుకున్న ఇమ్మూ

టైమ్ తీసుకుంటున్న టాప్‌ స్టార్స్‌… ఈ గ్యాప్ మంచిదేనా

Zombie Reddy 2: త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న జాంబీ రెడ్డి సీక్వెల్

బడ్జెట్ రికార్డులు బ్రేక్ చేస్తున్న సంజయ్ లీలా భన్సాలి

Tamannaah Bhatia: బిజినెస్‌ పాఠాలు చెబుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *