
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవలే పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయపూర్ వేదికగా వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఇద్దరూ వివాహం చేసుకోవడం ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభించారు విజయ్ – రష్మిక. అయితే ఫిబ్రవరి 26న ఉదయం సరిగ్గా 10:10 గంటలకు తమ పెళ్లి ముహూర్తాన్ని ఎంచుకున్నారీ విరోష్ జంట. ప్రస్తుతం ఈ ముహూర్తంపై సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలుగు, కొడవ సంప్రదాయాల ప్రకారం విజయ్- రష్మికల వివాహ వేడుక జరిగింది. సంప్రదాయ దుస్తులు, ఆచారాలు, కుటుంబ వాతావరణంలో జరిగిన విరోష్ వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో వివాహ ముహూర్త సమయాన్ని 10:10 గంటలుగా ఎంచుకోవడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.
సాధారణంగా ప్రకటనలు లేదా షోరూమ్‌లలో గడియారాలను మనం పరిశీలిస్తే, అక్కడ సమయం చాలా వరకు 10:10 గంటలుగా ఉంటుంది. గడియారాలలో గంటల ముల్లు 10 వద్ద, నిమిషాల ముల్లు 2 వద్ద ఉంటుంది. కాబట్టి, ఈ సమయం కేవలం యాదృచ్చికమా లేదా దీని వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్. న్యూమరాలజిస్టుల ప్రకారం సంఖ్యాశాస్త్రంలో 10.10 కు ఒక ప్రత్యేకత ఉందట. చాలా మంది సంఖ్యా శాస్త్రవేత్తల ప్రకారం, ఈ సంఖ్య కొత్త ప్రారంభాలు, ప్రేమ, సానుకూల శక్తి, విజయానికి సంకేతంగా పరిగణిస్తారట. అలాగే 10. 10 ను ‘ఏంజిల్స్ నంబర్’ అని కూడా పిలుస్తారట. ఇది జీవితంలో ఆనందం, స్వచ్ఛత, మంచి అవకాశాలను సూచిస్తుందట. కొంతమంది సంఖ్యాశాస్త్రవేత్తల ప్రకారం, ఉదయం 10:00 గంటల నుంచి 10:20 గంటల మధ్య సమయం ‘లెకాబెల్’ అనే దేవదూతతో ముడిపడి ఉంటుందట. ఇది విజయం, భద్రత, కొత్త ప్రయత్నాలకు శుభప్రదంగా భావిస్తారు. అందువల్ల, చాలా మంది ఈ సమయాన్ని కొత్త ప్రయత్నాలను ప్రారంభించడానికి శుభప్రదంగా భావిస్తారట. ఈ క్రమంలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ తమ వివాహం కోసం 10:10 ముహూర్తాన్ని ఎంచుకున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఈ సమయాన్ని సానుకూల శక్తి, కొత్త ప్రారంభాలకు సంకేతంగా పరిగణిస్తారు. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ రష్మిక- విజయ్ దేవరకొండలు కలకాలం కలిసి ఉండాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు.
విజయ్- రష్మికల పెళ్లి ఫొటోలు..
24.02.26
Our Sangeeth night.
The evening that was spent laughing till we had tears, dancing till the arches of our feet hurt, swallowing emotions to everyones speeches and surprises till our eyes were leaking.
Was a big happy party filled with beautiful people
pic.twitter.com/50aJvBHxQN
— Vijay Deverakonda (@TheDeverakonda) March 3, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.