Vijay-Rashmika: విజయ్, రష్మిక వివాహ వేడుక.. సంగీత్‌లో డాన్స్‌లతో అదరగొట్టిన జంట

Vijay-Rashmika: విజయ్, రష్మిక వివాహ వేడుక.. సంగీత్‌లో డాన్స్‌లతో అదరగొట్టిన జంట


స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం మరికొన్ని గంటల్లో జరగనుంది. ఈరోజు ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ఉదయ్‌పూర్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరగనుంది. అదేవిధంగా సాయంత్రం 4.30 గంటలకు కొడవ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహ వేడుక జరగనుంది. నిన్న రాత్రి సంగీత్‌లో హిట్ పాటల సందడి మాత్రం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఎంతో హుషారుగా జరిగింది. ఈ కార్యక్రమం అందరినీ అలరించింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంట వ్యక్తిగత ప్లేలిస్ట్, వారి సినీ ప్రయాణాన్ని గుర్తు చేసే పాటలు వరుసగా వినిపించడంతో వేడుక నోస్టాల్జిక్ మూడ్‌లోకి వెళ్లింది.

గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల పాటలు ప్లే అవుతుండగా అతిథులు ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు. ఇంకేమ్ ఇంకేమ్, కల్యాణి వాచా వాచా వంటి ట్రాక్‌లు వేడుకకు వెచ్చదనాన్ని జోడించాయి. అయితే సాయంత్రం అసలు హైలైట్ —
పుష్ప 2 సినిమాలోని వైరల్ సాంగ్ పీలింగ్స్ ట్రాక్. పాట మొదలైన వెంటనే అతిథులంతా డ్యాన్స్ ఫ్లోర్‌కి చేరి సంగీత్‌ను ఫుల్ హై-ఎనర్జీ పార్టీగా కొనసాగింది.

మంగళవారం నిర్వహించిన సరదా మ్యాచ్‌లో పెళ్లికొడుకు – పెళ్లికూతురు జట్ల మధ్య ఆసక్తికర పోటీ జరిగింది. ఈ మ్యాచ్‌లో విజయ్ టీమ్ విజయం సాధించింది. మ్యూజికల్ ఛైర్ ఆటలో రష్మిక టీమ్ విజయం సాధించగా, టగ్ ఆఫ్ వార్ ఆటలో మాత్రం విజయ్ టీమ్ పైచేయి సాధించింది. ప్రస్తుతం ఆటపాటలు, సందడి మధ్య హల్దీ కార్యక్రమం ఉల్లాసంగా కొనసాగుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *