Vijay-Rashmika: విజయ్ మాట వినగానే రష్మికలో సిగ్గు మొగ్గలేసిందిగా..!! వైరల్ అవుతున్న వీడియో

Vijay-Rashmika: విజయ్ మాట వినగానే రష్మికలో సిగ్గు మొగ్గలేసిందిగా..!! వైరల్ అవుతున్న వీడియో


Vijay-Rashmika: విజయ్ మాట వినగానే రష్మికలో సిగ్గు మొగ్గలేసిందిగా..!! వైరల్ అవుతున్న వీడియో

విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న పెళ్లి గ్రాండ్ గా జరుగుతుంది. నేడు ఉదయ్ పూర్ లో వీరి వివాహ వేడుక జరుగుతుంది. కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తెలుస్తున్న ఈ ఇద్దరూ ఇప్పుడు పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. విజయ్, రష్మిక కలిసి రెండు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. తొలిసారి ఈ ఇద్దరూ కలిసి గీతగోవిందం సినిమాలో హీరో, హీరోయిన్ గా కనిపించారు. వీరి మధ్య ఏర్పడిన పరిచయం..  రెండో సినిమా సమయానికి ప్రేమగా మారింది. డియర్ కామ్రేడ్ సినిమాలో విజయ్ రష్మిక కలిసి నటించారు. ఇక చాలా కాలం ప్రేమలో ఉన్న ఈ ఈ ఇద్దరూ ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. నేడు ( ఫిబ్రవరి 26న ) విజయ్ రష్మిక వివాహం జరిగింది.

రాజస్థాన్ ఉదయ్‌పూర్ వేదికగా వేడుకగా జరిగిన మూడు ముళ్ల పండక్కి అత్యంత ఆత్మీయులు హాజరయ్యారు. తెలుగు సంప్రదాయం ప్రకారం నిర్వహించిన పెళ్లి కోసం బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. సరిగ్గా 10 గంటల 10 నిమిషాలకు  వీరి వివాహం జరిగింది. అలాగే సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు కొడవ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహ వేడుక జరగనుంది. సోషల్ మీడియా వేదికగా విజయ్, రష్మికాకు అభిమానులు, పలువురు సెలబ్రెటీలు విషెస్ తెలుపుతున్నారు.

కాగా గతంలో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ షోలో పాల్గొంది రష్మిక. యానిమల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ, రష్మిక హాజరయ్యారు. ఆ సమయంలో విజయ్‌కు లైవ్ లో కాల్ చేసింది రష్మిక. ఫోన్ లిఫ్ట్ చేసి వాట్సాప్ రే అని విజయ్ అనగానే  రష్మిక తెగ సిగ్గు పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

 

View this post on Instagram

 

A post shared by Pop Diaries Pvt Ltd (@ipopdiaries)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *