Video Viral: సీఎం యోగి జపాన్ పర్యటన సందర్భంగా ఆసక్తికర ఘటన.. పిల్లలు చేసిన పనికి షాక్!

Video Viral: సీఎం యోగి జపాన్ పర్యటన సందర్భంగా ఆసక్తికర ఘటన.. పిల్లలు చేసిన పనికి షాక్!


ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండు రోజుల జపాన్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా ఒక ఆసక్తికరమైన దృశ్యం చోటు చేసుకుంది. యమునాషికి వెళ్లే దారిలో, కొంతమంది పిల్లలతో సహా భారత సంతతికి చెందిన వ్యక్తులు ఆయన వద్దకు వచ్చారు. ఈ పిల్లలు సీఎం యోగి ముందు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పాదాలను తాకారు. ఆ తర్వాత వారు ఆయన ముందు సంస్కృత శ్లోకాలను పఠించారు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారత సంతతికి చెందిన పిల్లలను, వారి కుటుంబాలను కలిసిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో ఆయన టోక్యో నుండి యమనాషికి ప్రయాణిస్తున్నప్పుడు తీసినట్లు సమాచారం.ఆ సమయంలో కొంతమంది భారత సంతతికి చెందిన మహిళలు, పిల్లలు ఆ దారిలో వచ్చారు. వారిని చూసి ఆగిన సీఎం యోగి వారితో కాసేపు ముచ్చటించారు. ఇంతలో, ఒక చిన్న పిల్లవాడు ఆయనను కలవడానికి వచ్చి, ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేసి, ఆయన పాదాలను తాకి, సంస్కృత శ్లోకాన్ని పఠించాడు. ముఖ్యమంత్రి యోగి కూడా పిల్లాడితో పాటు శ్లోకాలు చదువుతూ కనిపించారు. ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చిన మహిళ ఆయన కోసం ఒక బహుమతిని కూడా తెచ్చింది. దానిని ముఖ్యమంత్రి యోగి ఎంతో ఆనందంతో స్వీకరించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పిల్లలకు చాక్లెట్లు బహూకరించి ప్రేమగా వారి తలలపై చేయి ఉంచి ఆశీర్వదించారు.

అంతకుముందు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జపాన్‌లోని భారత సంతతి సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ సాధిస్తున్న విజయాలను వివరించారు. ఉత్తరప్రదేశ్ ఒకప్పుడు కర్ఫ్యూలు, అల్లర్లు, విద్యుత్ కోతలను అల్లాడిపోయిందని, కానీ ఇప్పుడు పండుగలు, అభివృద్ధితో దూసుకుపోతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఇదిలావుంటే, సీఎం యోగి జపాన్ పర్యటన ఈరోజుతో ముగియనుంది. ఆ తర్వాత ఆయన భారతదేశానికి తిరిగి వస్తారు. ఉత్తరప్రదేశ్‌లో పెట్టుబడులు, ఉపాధికి ఈ పర్యటన చాలా కీలకం. ఈ పర్యటన సందర్భంగా ఆయన అనేక ప్రధాన కంపెనీల ప్రతినిధులతో సమావేశమై ఉత్తరప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టమని వారిని ప్రోత్సహించారు. రాష్ట్ర మౌలిక సదుపాయాలు, శాంతిభద్రతలపై తమ ప్రభుత్వం విస్తృతమైన కృషి చేపట్టిందని సీఎం యోగి పేర్కొన్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *