ఈ జనరేషన్ యూత్ ఎంత టాలెంటెడ్‌గా ఉన్నారో.. అదే యూత్‌లో కొంతమంది పిచ్చి చేష్టలతో కన్నవారికి కడుపుకోత మిగిల్చేలా ప్రవర్తిస్తున్నారు. యుక్తవయసులో కాస్త ఉత్సాహంగా, అల్లరి పనులు చేయడం సరదానే అయినా.. మరి హద్దు మీరి ప్రవర్తిస్తే మొదటికే మోసం వస్తుంది. అలాంటి పిచ్చి చేష్టలతో కొంతమంది యువకులు చేసిన రచ్చపై నెటిన్లు మండిపడుతున్నారు. స్కూటీపై ప్రమాదకరంగా ఐదుగురు యువకులు వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఐదుగురు యువకులు స్కూటీపై డేంజరస్ స్టంట్ చేశారు. వారిలో నలుగురు స్కూటీపై కూర్చుని ఉండగా, ఐదవ వ్యక్తిని స్కూటీపై ఉన్న నలుగురు తమ భుజాలపై ఎత్తుకున్నారు. చూస్తుంటునే ఎప్పుడెప్పుడు పడిపోతాడో అనేంత ప్రమాదకరంగా ఉన్నాడు. ఈ దృశ్యాలను అటుగా వెళ్తున్న వారి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో చూసిన వారు.. ఎందుకీ పిచ్చి పనులంటూ వారిని తిట్టిపోస్తున్నారు. కాగా ఈ వీడియో పోలీసుల వరకు చేరడంతో యువకులను గుర్తించడానికి బీజాపూర్ పోలీసులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి