Video: ఉన్న పరువు కాస్తా పాయె.. భారత్‌ విజయంపై పాక్‌లోనూ సంబరాలు! ఎవరు సెలబ్రేట్ చేసుకున్నారంటే..?

Video: ఉన్న పరువు కాస్తా పాయె.. భారత్‌ విజయంపై పాక్‌లోనూ సంబరాలు! ఎవరు సెలబ్రేట్ చేసుకున్నారంటే..?


సెప్టెంబర్ 28న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి టీమిండియా ఛాంపియన్‌గా నిలిచింది. ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఇండియా అంతటా సంబరాలు జరిగాయి. అయితే కేవలం ఇండియాలోనే కాదు టీమిండియా విక్టరీని పాకిస్థాన్‌లోనూ సెలబ్రేట్‌ చేసుకున్నారు. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. పైగా జై హింద్‌ అంటూ నినాదాలు కూడా చేశారు. ఇంతకీ ఆ సెలబ్రేషన్‌ చేసుకుంది ఎవరో కాదు.. ఆఫ్ఘనిస్థాన్‌ పౌరులు. పాకిస్తాన్‌లో చదువుకుంటున్న ఆఫ్ఘన్ విద్యార్థులు టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తూ “జై హింద్” అని నినాదాలు చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అఫ్ఘాన్ విద్యార్థులు గుంపులు గుంపులుగా జరుపుకుంటున్న దృశ్యాలు, వారి నినాదాలు హైలెట్‌ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడ్డారు. ఒకరు “ఆఫ్ఘనిస్తాన్ ఇండియా భాయ్ భాయ్” అని వ్యాఖ్యానించారు. మరొకరు “భారత్‌, ఆఫ్ఘనిస్తాన్ లోతైన శాశ్వతమైన వ్యక్తుల మధ్య సంబంధాన్ని కలిగి ఉన్నాయి” అని కామెంట్‌ చేశారు.

కాగా చాలా కాలంగా భారత్‌, ఆఫ్గాన్‌ మధ్య మంచి స్నేహవాతావరణం ఉన్న విషయం తెలిసిందే. బీసీసీఐ సైతం ఆఫ్ఘాన్‌లో క్రికెట్‌ అభివృద్ధి కోసం నిధులు సైతం కేటాయించి, ఆ దేశంలో క్రికెట్‌ డెవలప్‌మెంట్‌ కోసం ఎంతో శ్రమించింది. అలాగే ఆఫ్ఠాన్‌ ప్లేయర్లకు ఎంతో విలువైన క్రికెట్‌ ట్రైనింగ్‌ కూడా ఇప్పించింది. ఇలా ఆఫ్టాన్‌ క్రికెట్‌ కోసం భారత్‌ ఎంతో తోడ్పాటు అందించింది. అందుకే ఆఫ్ఘాన్‌ పౌరులకే టీమిండియా అంటే అభిమానం. వేరే దేశంతో ఆడుతున్న సమయంలో కూడా చాలా మంది ఆఫ్ఠాన్‌ పౌరులు టీమిండియాకే సపోర్ట్‌ చేస్తుంటారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *