Headlines

Viagra: వయాగ్రాని ఎవరు వేసుకోవచ్చు.. ఎవరు వేసుకోకూడదు.. వీరికి మాత్రం డేంజర్

Viagra: వయాగ్రాని ఎవరు వేసుకోవచ్చు.. ఎవరు వేసుకోకూడదు.. వీరికి మాత్రం డేంజర్


Viagra: వయాగ్రాని ఎవరు వేసుకోవచ్చు.. ఎవరు వేసుకోకూడదు.. వీరికి మాత్రం డేంజర్

వయాగ్రా వాడకం వల్ల సాధారణంగా తలనొప్పి(40 శాతం మందిలో), ముక్కు దిబ్బడ, మెడ పట్టేయడం వంటివి కలగవచ్చు. తీవ్రమైన గుండె, కిడ్నీ, లివర్ జబ్బులు ఉన్నవారు, లేదా నైట్రేట్లు కలిగిన గుండె మందులు వాడేవారు దీనిని తీసుకోకూడదు. వివరాల్లోకి వెళ్తే.. వయాగ్రాను ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు. దీని దుష్ప్రభావాలపై ప్రతీ ఒక్కరికి స్పష్టత అవసరం. సాధారణంగా, వయాగ్రా పెద్ద సీరియస్ సమస్యలను కలిగించదు. అయితే, కొన్ని సాధారణ దుష్ప్రభావాలు ఉన్నాయి.

వీటిలో 40 శాతం మందిలో కనిపించే తలనొప్పి ఒకటి. ఈ తలనొప్పి తలలో సుత్తితో కొట్టినట్లు అనిపించవచ్చు. ముక్కు దిబ్బడ, మెడ పట్టేయడం వంటివి కూడా సాధారణంగా కనిపించే ఇతర దుష్ప్రభావాలు. ఈ మూడు చాలా సాధారణమైనవి, తీవ్రమైన కాంప్లికేషన్స్ కావు. వయాగ్రాను తీసుకోకూడని వారు ఎవరంటే.. తీవ్రమైన గుండె జబ్బులు, కిడ్నీ సంబంధిత సమస్యలు, లేదా లివర్ జబ్బులు ఉన్నవారు దీనిని పూర్తిగా నివారించాలి. అంతేకాకుండా, గుండె సమస్యల కోసం కొన్ని ప్రత్యేక మందులు వాడేవారు, అవి సార్బిట్రేట్, ఇండ్యూర్, నైట్రేట్స్, లేదా నైట్రోలాంగ్ వంటివి, ఈ టాబ్లెట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. అయితే, ప్రాస్టేట్ సంబంధిత మందులు వాడేవారు లేదా పైన పేర్కొన్న గుండె మందులు వాడేవారు వయాగ్రాను కచ్చితంగా వైద్యుల పర్యవేక్షణలో వేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఇది చదవండి: ఆపరేషన్ అక్కర్లేదు.. 15 రోజులు ఇలా చేస్తే పైల్స్ రోగం మళ్లీ రానే రాదు..

(ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. మీకు ఈ పిల్స్ తీసుకునేముందు వైద్యులను సంప్రదించండి)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *