మట్టితో తయారు చేసిన కుండను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుంది. మట్టికుండ భూమి తత్వానికి దగ్గరగా ఉండడంతో ప్రతికూల శక్తిని తొలగుతుంది. మట్టికుండ ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తి తొలగిపోతుంది.. ఇంటి మొత్తానికి సానుకూల శక్తి వస్తుంది. దీంతో కుటుంబం మొత్తం సంతోషంగా ఉండొచ్చు. మట్టికుండని ఇంట్లో ఉంచితే మనసుకు శాంతి కలుగుతుంది. సరైన దిశలో మట్టికుండను ఉంచితే శక్తి సమతుల్యం అవుతుంది. దీంతో మానసిక సమస్యలు రావు.
ఆర్థిక శ్రేయస్సుఇంట్లో మట్టికుండను ఉంచడం లేదా మట్టికుండల తులసి మొక్కను పెంచడం వంటివి చేస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. సంపద, శ్రేయస్సు రెండూ కలుగుతాయి. మట్టికుండను ఇంట్లో పెట్టడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుతాయి. ఇంట్లో మట్టికుండ ఉంటే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. సానుకూల శక్తి ప్రవహించి ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉంటారు.
మట్టికుండను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో అందరి ఆరోగ్యం కూడా బాగుంటుంది. వివిధ రకాల వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. మట్టికుండలో నీరు తాగితే మరీ మంచిది. మట్టికుండను పూజ గదిలో ఉంచడం వల్ల ఇంటి మొత్తానికి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. భక్తితో చేసే పూజకు శక్తి కలుగుతుంది. మట్టికుండ పర్యావరణానికి ఎలాంటి హాని చేయదు. ప్రకృతికి నష్టమే ఉండదు. మట్టికుండ వాడితే పర్యావరణానికి మేలు జరుగుతుంది.
ఇవి కూడా చదవండి
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న ఫెంగ్ షుయ్ సలహాలు, సంప్రదాయ నమ్మకాల ఆధారంగా చెప్పబడ్డాయి. ఇది శాస్త్రీయంగా నిరూపించబడిన విషయం కాదు. వీటిని విశ్వసించడం లేదా పాటించడం పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయం, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..