వాస్తు శాస్త్రం ప్రకారం జీవితంలో అనేక సమస్యలను నివారించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ప్రజలు తరచుగా రోజువారీ జీవితంలో ఉపయోగించే వస్తువులను ఇచ్చి, తీసుకుంటూ ఉంటారు. కానీ, డబ్బు చెల్లించకుండా తీసుకోకూడనివి చాలా ఉన్నాయి. ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తిని తెస్తుంది. ఇది వివిధ సమస్యలు, పేదరికానికి దారితీస్తుంది. అలా, మన జీవితంలో ఊరికే ఇవ్వకూడని, ఊరికే తీసుకోకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి. అలాంటివి డబ్బు చెల్లించకుండా కొనుగోలు చేస్తే ఆర్థిక సమస్యలకు మాత్రమే కాకుండా, ఇంట్లో ఆనందం, అశాంతికి కారణం అవుతుందని జ్యోతిష్య, వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాటి గురించి మరింత తెలుసుకుందాం…
వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం,.. ఇంట్లో ఉప్పు అయిపోయినప్పుడు చాలా మంది ఇరుగుపొరుగు లేదా బంధువుల నుంచి తీసుకుంటారు. కానీ, చాలా పెద్ద తప్పు అంటున్నారు నిపుణులు. అలా చేయకూడదని చెబుతున్నార. మీ ఇంట్లో ఉప్పు అయిపోతే పొరపాటున కూడా ఊరికే ఎవరి నుంచీ తీసుకోవద్దనీ, ఎవరికీ ఇవ్వకూడదనీ చెబుతున్నారు.. జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవునికీ ఉప్పుకీ ఉన్న సంబంధాన్ని వివరించారు. ఉప్పును దానం చేస్తే, శనిదేవుడికి కోపం వస్తుందట. డబ్బు లేకుండా ఉప్పు లావాదేవీలు జరిపితే.. వ్యాధులు, లోపాలను ఆహ్వానించినట్లే. ఇలా చేయడం వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోతారని అంటున్నారు.
పెరుగును ఊరికే ఎవరి నుంచీ తీసుకోకూడదు లేదా ఊరికే ఎవరికీ ఇవ్వకూడదు. తరచుగా మనం పెరుగు చేయడానికి మన పొరుగువారి నుంచి కొంత పెరుగును అప్పుగా తీసుకుంటాం. దానిని ఇంట్లో పెరుగు చేయడానికి ఉపయోగిస్తాం. ఇలా పెరుగును తీసుకుంటే, ఇంట్లో టెన్షన్, అశాంతి వాతావరణం మొదలవుతుంది. డబ్బు వృధా అవుతుంది. అందుకే పొరపాటున కూడా ఊరికే పెరుగు తీసుకోకూడదు, ఇవ్వకూడదు. అందుకే చాలా మంది పెరుగు ప్యాకెట్ కొనేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
నల్లనువ్వులను ఊరికే ఎవరికీ ఇవ్వకూడదనీ, ఎవరి దగ్గర నుంచీ వాటిని ఊరికే తీసుకోకూడదని వాస్తు శాస్త్రంలో తెలిపారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం, రాహు-కేతువులతో పాటు, శనిగ్రహంతో నల్ల నువ్వులకు సంబంధం ఉంటుంది. ఒక వ్యక్తి డబ్బు లేకుండా నల్లనువ్వులను తీసుకున్నా లేదా ఇచ్చినా, ఆ వ్యక్తి తన జీవితంలో అనవసరమైన ఖర్చులను ఎదుర్కోవలసి ఉంటుంది, డబ్బు వృధా కావడం ప్రారంభమవుతుంది. ఇలా శనివారం నాడు అస్సలు చేయకూడదు.
సూది సూదిని కూడా డబ్బు లేకుండా ఇంట్లోకి తీసుకురాకూడదట. అది ఇంటిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. సూదిని తీసుకోవటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ నాశనం అవుతుంది. కుటుంబ వాతావరణంలో విభేదాలకు దారితీస్తుంది. అందువల్ల, సూదులను ఎప్పుడూ విరాళంగా తీసుకోకూడదు. సూది దానిని ఎలా పరిగణిస్తారో అలాగే పనిచేస్తుందని, చెల్లింపు లేకుండా దానిని తీసుకోవటం వల్ల అనేక ఇబ్బందులకు దారితీస్తుందని గ్రంథాలు చెబుతున్నాయి.
డబ్బు లేకుండా నూనెను ఎప్పుడూ తీసుకోకూడదట. అలా చేయడం దురదృష్టంగా పరిగణిస్తారు. నూనెను దానంగా స్వీకరించడం వల్ల జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి, ఇంటికి తీసుకెళ్లే ముందు ఎల్లప్పుడూ డబ్బుతో నూనె కొనాలని గుర్తుంచుకోండి. ఎవరి నుండి నూనెను ఎప్పుడూ తీసుకోకండి. మీ జాతకంలో శని స్థానం మంచిది కాకపోతే, ఆవ నూనెలో వండిన కూరగాయలు తినడం వల్ల శని స్థానం బలపడుతుంది. కానీ, నూనెను దానం చేయడం వల్ల శని అశుభ స్థానానికి కూడా దారితీయవచ్చు.
ఇనుము శని దేవునితో ముడిపడి ఉందని నమ్ముతారు. కాబట్టి డబ్బు చెల్లించకుండా ఎవరి నుండి ఇనుమును తీసుకోకూడదు. ఇనుమును దానం చేయడం అంటే మీరు శని దేవుని నుండి దానం స్వీకరించినట్లుగా పరిగణించబడుతుంది. అంటే మీరు ఇనుమును స్వీకరించిన వ్యక్తిపై శని దేవుని ప్రతికూల ప్రభావాలు మీపై పడతాయి. శనివారం ఇనుమును తీసుకోకూడదని కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అలా చేయడం వల్ల శని దేవుని కోపం వస్తుంది. శని సాడే సతి ప్రభావంలో ఉన్నవారు శనివారం ఇనుమును దానం చేయవచ్చు.
వ్యక్తి నుంచి రుమాలు ఊరికే తీసుకోకూడదు లేదా ఇవ్వకూడదు, బహుమతిగా కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఇంట్లో గొడవలు, మనస్పర్థలు పెరిగి జీవితంలో అనేక రకాల సమస్యలు రావడం మొదలవుతాయి.
అగ్గిపెట్టెను డబ్బు ఇవ్వకుండా ఎవరి దగ్గరా ఊరికే తీసుకోకూడదు, ఇవ్వకూడదు. ఇది అగ్ని దేవుడికి సంబంధించినది. బంధుమిత్రుల మధ్య కోపాలు ఎక్కువై, వివాదాలు రావచ్చు. ఇంటి శాంతి పోయి, రకరకాల సమస్యలు రావచ్చు.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న ఫెంగ్ షుయ్ సలహాలు, సంప్రదాయ నమ్మకాల ఆధారంగా చెప్పబడ్డాయి. ఇది శాస్త్రీయంగా నిరూపించబడిన విషయం కాదు. వీటిని విశ్వసించడం లేదా పాటించడం పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయం, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..