Vastu Tips: ఇంట్లో రామ చిలుకను పెంచుకుంటున్నారా..! శుభమో? అశుభమో? తెలుసుకోండి..

Vastu Tips: ఇంట్లో రామ చిలుకను పెంచుకుంటున్నారా..! శుభమో? అశుభమో? తెలుసుకోండి..


చాలా మందికి జంతువులను, పక్షులను పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. కొందరు కుక్కలను, మరికొందరు కుందేళ్ళను పెంచుకుంటారు. అయితే రామ చిలుకని పెంచుకునే వారి సంఖ్య చాలా తక్కువే. చాలా మందికి రామచిలుకను పెంచుకోవాలని కోరుకుంటారు.. అయితే రామ చిలుకని పెంచుకోవడం మంచిదా..! కాదా అనే విషయంలో అయోమయంలో ఉంటారు. మీరు కూడా రామ చిలుకని పెంచుకోవడంలో అనుమానం ఉంటే దానికి సమాధానం తెలుసుకుందాం..

మానవ భాషను అర్థం చేసుకుని అదే భాషలో స్పందించగల జంతువు లేదా పక్షి భూమిపై చాలా అరుదు. అయితే రామ చిలుకలు ఈ అద్బుతాన్ని చేస్తాయి. తమ యజమాని చెప్పిన మాటలకు ప్రతిస్పందిస్తాయి తమ అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం చిలుకను ఉంచుకోవడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు వస్తుంది. శుభ సంఘటనలతో పాటు కొన్నిసార్లు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. వాస్తు ప్రకారం ఏది సరైనది? ఏది తప్పు అనేది తెలుసుకుందాం.

రామ చిలుకని పెంచుకోవడం వలన లాభాలు

ఇంట్లో రామ చిలుకను పెంచుకోవడం వల్ల దుఃఖాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ విషయం గురించి అనేక ఆధ్యాత్మిక గ్రంథాలలో ప్రస్తావన ఉంది. వాస్తు ప్రకారం ఎవరైనా రామ చిలుకను తమ ఇంటికి తీసుకువచ్చి దానిని బాగా చూసుకుంటే.. అది అనేక ప్రయోజనాలను తెస్తుంది. ఇంటిలోని సభ్యులు తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షించబడతారు. ప్రతికూల ఆలోచనలు, సమస్యలు నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు ఇంట్లో రామ చిలుక ఉండటం పేదరికాన్ని నివారిస్తుందని నమ్ముతారు. అనారోగ్యం, నిరాశ , పేదరికం వంటి సమస్యల నుంచి బయటపడతారని నమ్మకం.

ఇవి కూడా చదవండి

రామ చిలుకను ఏ దిశలో ఉంచాలి? ఏమి తినిపించాలి?

రామ చిలుకను పెంచుకోవడం ఒక అభిరుచి అయినప్పటికీ.. అనేక జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా రామ చిలుకను పెంచుకుంటే.. దానిని తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచండి. ఇంకా ఆహారం, పానీయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రామ చిలుకకు ఆకుపచ్చ ఆహారం తినిపించడం వల్ల ఇంటికి ఆశీర్వాదం వస్తుంది.

పిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా చిలుకను పెంచుకోవాలి

రామ చిలుకను పెంచుకోవడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధాలు పెంపొందుతాయని చెబుతారు. ఇది భార్యాభర్తల మధ్య స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తుంది. ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. పిల్లలు ఉన్నవారు తప్పనిసరిగా రామ చిలుకను పెంచుకోవాలి. ఎందుకంటే రామ చిలుక పిల్లల్లో నేర్చుకోవడం, విద్యపై ఆసక్తిని పెంచుతుంది.

అకాల మరణం రాకుండా ఉండాలంటే

నమ్మకం ప్రకారం చిలుకను ప్రేమించడం విధేయతను సూచిస్తుంది. అకాల మృత్యు దోషం తొలగి దీర్ఘాయుష్షు కలుగుతుందని.. రామ చిలుకలను పెంచుకునే అదృష్టం కలుగుతుందని చెబుతారు. రామ చిలుకల ప్రేమ కూడా అదృష్టాన్ని తెస్తుంది. చాలా మంది తమ ఇళ్లలో,ఆఫీసులో లేదా దుకాణాలలో రామ చిలుకల చిత్రాలు లేదా విగ్రహాలను ఉంచుతారు. ఇలా చేయడం శుభప్రదంగా భావిస్తారు. చిలుకను ఉంచడం లేదా దాని చిత్రాన్ని ఉంచడం వల్ల మీ ఇంటిని రాహువు, కేతువు , శని ప్రభావం నుంచి రక్షిస్తుంది. అయితే ఒక చిన్న పొరపాటు కూడా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.

రామ చిలుకనుపెంచుకుంటే ఈ విషయాన్ని గుర్తుంచుకోండి

ఇంట్లో రామ చిలుకని పెంచుకుంటుంటే.. దానిని పక్షి బోనులో ఉంచితే.. దానిని సంతోషంగా ఉంచుకోవడం మీ అతిపెద్ద బాధ్యత అవుతుంది. రామ చిలుక తమ యజమానిపై కోపంగా ఉంటే..ఆ ప్రభావం ఇంట్లో సభ్యులపై పడుతుంది. ఇంట్లో వివాదాస్పదంగా ఉంటే.. అది చిలుకపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. రామ చిలుక స్వభావం.. తాను చూసే, వినే దాని ద్వారా ప్రభావితమవుతుంది. కొన్నిసార్లు రామ చిలుక శపిస్తుందని.. అది ఎవరికీ శుభం కాదని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *