వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించిన ఇల్లు.. అందులో పేర్కొన్న నియమాలను పాటించే ఇల్లు ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సుతో నిండి ఉంటుంది. అయితే వాస్తు నియమాలను విస్మరించడం వల్ల వాస్తు దోషాలు ఏర్పడవచ్చు.. ఇది అనేక రకాల సమస్యలను కలిగిస్తుంది. ఇంట్లో అందం కోసం పెట్టుకునే తాబేలు విగ్రహానికి కూడా వాస్తు శాస్త్రంలో, ఫ్నెగ్ షుయ్లో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ తాబేలుకి హిందూ పురాణాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు మనం ఇంట్లో తాబేలు విగ్రహాన్ని ఉంచడం ఎలా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..
ఇంట్లో తాబేలు విగ్రహాన్ని పెట్టడం వలన సంపద, శ్రేయస్సు, అదృష్టం లభిస్తాయని వాస్తు శాస్త్రం పేర్కొంది. అంతేకాదు తాబేలు ఇంట్లో సానుకూల శక్తి ప్రసరణను పెంచుతుంది. ప్రతికూల శక్తిని దూరంగా ఉంచుతుంది. అంతేకాదు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తాబేలు విగ్రహాన్ని ఉంచడం వల్ల వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. తాబేలు విగ్రహాన్ని ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి సంపద పెరుగుతుందని నమ్ముతారు. తాబేలు విగ్రహం ఇంటికి రక్షణ కవచంగా పనిచేస్తుంది.
ఏ దిశలో ఉంచాలంటే.. తాబేలు విగ్రహాన్ని ఎల్లప్పుడూ ఇంటికి ఉత్తరం లేదా వాయువ్య దిశలో ఉంచాలి. ఇది మీకు సానుకూల ఫలితాలను తెస్తుంది. ఇత్తడి, బంగారం లేదా వెండితో చేసిన తాబేలు విగ్రహాన్ని ఈ దిశలో ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
స్పటిక తాబేలు : ఇంట్లో స్పటిక తాబేలు బొమ్మను పెట్టాలనుకుంటే దానిని ఈశాన్య దిశలో ఉంచండి. వాస్తు శాస్త్రం కూడా నీరు నిండిన ప్రాంతంలో తాబేలు బొమ్మను ఉంచడం శుభప్రదంగా పేర్కొంది. తాబేలు బొమ్మలో వేసిన నీటిని ప్రతిరోజూ మార్చాలి.
లోహం తాబేలు: మెటల్ తాబేలు సంపదను సూచిస్తుంది. కెరీర్ వృద్ధిని కోరుకుంటే మెటల్ తాబేలునుఆఫీసులో ఉంచడం మంచిది. కెరీర్లో పురోగతి సాధించాలనుకుంటే.. ఉత్తర దిశలో తాబేలును ఉంచడం మంచిది.
చెక్క తాబేలు: వాస్తు శాస్త్రం ప్రకారం, తూర్పు లేదా ఆగ్నేయ మూలలో చెక్క తాబేలును ఉంచడం వల్ల ఇంటిలోని అన్ని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఇది స్నేహితులు, కుటుంబ సభ్యుల జీవితాలను ఆనందం, మంచి కర్మ, సాధనతో నింపుతుంది.
పిల్లలతో ఉన్న తాబేలు: తాబేలు బొమ్మలు అనేక రకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఆడ తాబేలు, పిల్లలు. ఇలా ఉన్న తాబేలు కుటుంబానికి ప్రతీకగా పరిగణించబడుతుంది. పిల్లతో ఉన్న తాబేలును ఇంట్లో పెట్టుకుంటే కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తకుండా సహాయపడుతుంది.
తాబేలు విగ్రహాన్ని ఎక్కడ ఉంచాలంటే.. పిల్లలు చదువులో ఏకాగ్రత పెంచాలంటే తాబేలు విగ్రహాన్ని ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. దీనిని పిల్లల గదిలో ఉంచవచ్చు. ప్రధాన ద్వారం దగ్గర తాబేలు విగ్రహాన్ని ఉంచడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. తాబేలు నోరు లోపలికి చూసేలా విగ్రహాన్ని ఉంచండి.
తాబేలు ఉంచడానికి ఉత్తమ రోజు: బుధ, గురు, శుక్రవారాలు ఇంట్లో తాబేలు విగ్రహాలను ఉంచేందుకు అనువైన రోజులుగా భావిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం శుభ సమయాన్ని ఎంచుకుని.. తాబేలు విగ్రహానికి కుంకుమ లేదా పసుపు పువ్వులను సమర్పించండి. ప్రతిరోజూ తాబేలు విగ్రహంపై ఒక తులసి దళాన్ని ఉంచడం శుభసూచకం.