Varanasi: వారణాసి మూవీ అప్‌డేట్స్.. మంచు కొండల్లో మహేష్ విన్యాసాలు

Varanasi: వారణాసి మూవీ అప్‌డేట్స్.. మంచు కొండల్లో మహేష్ విన్యాసాలు


Varanasi: వారణాసి మూవీ అప్‌డేట్స్.. మంచు కొండల్లో మహేష్ విన్యాసాలు

యుద్ధాలు జరిగినా.. పిడుగులు పడినా.. తమ పని తాము చేస్తున్నారు వారణాసి టీం. ఈ సినిమా అప్‌డేట్స్ చూసి పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అంచనాలకు మించి షూటింగ్ రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతుండగా.. దీని ఓవర్సీస్ బిజినెస్ కూడా ఇండియన్ సినిమాలోనే రికార్డులు బద్దలు కొడుతోంది. అసలు షూట్ ఎక్కడ జరుగుతుంది.. గడ్డకట్టే మంచులో ఏం చేస్తున్నారు..? రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి షూటింగ్ అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ అంటార్కిటికాలోని గడ్డకట్టే మంచు కొండల్లో అత్యంత కఠినమైన వాతావరణంలో శరవేగంగా కొత్త షెడ్యూల్‌ను పూర్తి చేస్తున్నారు. మహేష్ అయితే ఈ సినిమా కోసం ఒక్కముక్కలో చెప్పాలంటే ప్రాణం పెట్టేస్తున్నారు. అంటార్కిటికా షెడ్యూల్‌లో మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య ఒక మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్‌ను రాజమౌళి భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. హాలీవుడ్ రేంజ్‌లో డిజైన్ చేసిన ఈ ఫైట్ సీన్ కోసం ఇద్దరు స్టార్స్ పోటీపడి మరీ నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా ఈ మధ్యే అంటార్కిటికా షెడ్యూల్‌పై అప్‌డేట్ లీక్ చేసారు. అక్కడ చిత్రీకరిస్తున్న తొలి ఇండియన్ సినిమా ఇదే. వారణాసి సినిమాకు అంటార్కిటికా షెడ్యూల్ మేజర్ హైలైట్ కాబోతుందని తెలుస్తుంది. అక్కడ చిత్రీకరిస్తున్న యాక్షన్ సీక్వెన్సులు ఇండియన్ స్క్రీన్ మీద నెవర్ బిఫోర్ అన్నట్లుగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ ఒక్క సీక్వెన్స్ కోసం జక్కన్న టీమ్ రేయింబవళ్లు ఎంతో శ్రమిస్తూ.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఓ విజువల్ వండర్‌గా దీన్ని చెక్కుతున్నారు. ఈ సినిమా మార్కెట్ గురించి ఏం చెప్పాలి..? ఓవర్సీస్‌లో మరే ఇండియన్ సినిమాకు అందనంత ఎత్తులో.. కళ్లు చెదిరే ధరకు వారణాసి రైట్స్ అడుగుతున్నారు. కానీ రాజమౌళి మాత్రం ఏం చెప్పట్లేదు. విడుదలకు ముందే ఈ రేంజ్ రికార్డులు సెట్ చేస్తుందంటే.. థియేటర్లలో ఆ వండర్స్ మన ఊహకే వదిలేయాలేమో..? ఏప్రిల్ 7, 2027న విడుదల కానుంది ఈ చిత్రం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nayanthara: అక్కడ నయన్ టాప్.. ముద్దుగుమ్మ స్పీడ్‌కు కనీసం పోటీ లేదుగా

Nenu Ready: త్రినాథరావు మార్క్ కామెడీతో వస్తున్న నేను రెడీ

కుర్ర హీరోలను రెమ్యునరేషన్లో.. దాటేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు

Drishyam 3: ‘దృశ్యం 3’కి వెంకీ నో చెప్పారా.. కారణం అదేనా

Indian 3: ఇండియన్‌ 3… శంకర్‌కి క్లారిటీ వచ్చిందా ??



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *