Value Zone: అమీర్‌పేట్‌లో వాల్యూ జోన్ ఆఫర్ల వర్షం.. కిక్కిరిసిన జనాలు.. 50 శాతం డిస్కౌంట్‌

Value Zone: అమీర్‌పేట్‌లో వాల్యూ జోన్ ఆఫర్ల వర్షం.. కిక్కిరిసిన జనాలు.. 50 శాతం డిస్కౌంట్‌


Value Zone: హైదరాబాద్‌లో ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు తమ ఔట్‌లెట్లను ప్రారంభించాయి. ఐకియా, లులూ మాల్ వంటి షాపింగ్ మాల్స్ ప్రారంభమయ్యాయి. తాజాగా.. ప్రముఖ రిటైల్‌ సంస్థ వాల్యూ జోన్‌ హైదరాబాద్‌లో వాల్యూజోన్‌ను ప్రారంభించింది. పండగ సీజన్‌ వస్తుందంటే చాలు పలు మాల్స్‌లలో డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లను అందిస్తుంటాయి. అయితే హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లోని వాల్యూ జోన్ హైపర్‌మార్ట్‌ షాపింగ్ ప్రేమికులకు పండుగ వాతావరణాన్ని అందిస్తోంది. తాజాగా ప్రారంభమైన ఈ ప్రత్యేక షాపింగ్ ఫెస్టివల్‌లో దసరా, దీపావళి పండుగల సందర్భాన్ని పురస్కరించుకుని వినియోగదారుల కోసం భారీ ఆఫర్లను అందిస్తోంది. కొత్తగా ప్రారంభమైన ఈ మాల్స్‌ జనాలతో కిక్కిరిసిపోతోంది. వాల్యూ జోన్‌లో 75,000కి పైగా ఉత్పత్తులు అతి తక్కువ ధరలకు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

సుమారు 2,500కు పైగా ప్రముఖ బ్రాండ్ల నుంచి అపారెల్స్, ఫుట్‌వేర్, కిడ్స్ వేర్, హోమ్ నీడ్స్ వంటి విభాగాల్లో విస్తృత కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. డిమార్ట్‌ ధీటుగా ఆఫర్లను అందిస్తోంది. అలాగే మాల్స్‌లో A to Z అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. చాలా ప్రోడక్ట్‌లపై బై 1 – గెట్ 1 ఫ్రీ ఆఫర్లు అందిస్తోంది. ఇలాంటి ఆఫర్లు వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ముందే పండగ సీజన్‌. అందులో కొత్తగా ప్రారంభమైన మాల్‌.. జనాలు ఎగబడి షాపింగ్‌ చేస్తున్నారు. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే నిత్యవసర వస్తవుల నుంచి బట్టల వరకు, అలాగే జ్యూలరీకి సంబంధించినవి అన్ని లభించడంతో జనాల తాకిడి ఎక్కువైపోయింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Gold Price Today: మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా?

అన్ని వర్గాల వారికి నాణ్యతమైన ఉత్పత్తులు అందించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు. వినియోగదారులకు విశాలమైన పార్కింగ్, సౌకర్యవంతమైన షాపింగ్ వాతావరణం కల్పించినట్లు తెలిపారు. స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని రకరకాల ఉత్పత్తులను అందిస్తున్నామని అన్నారు. ఈ మాల్‌లో బై 1 – గెట్ 1 ఫ్రీ ఆఫర్లతో పాటు 20 నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తున్నారు.

అయితే సాధారణంగా నిత్యవసర వస్తువులతో పాటు అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేసేందుకు డీమార్ట్‌ వెళ్తుంటారు. అక్కడైతే అతి తక్కువ ధరల్లోనే కొనుగోలు చేసుకోవచ్చు. ఎంత దూరమైనా సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వరకు చాలా మంది డీమార్ట్‌కు వెళ్తుంటారు. అయితే డీమార్ట్‌కు ధీటుగా ధరలు ఉన్నాయి ఈ వాల్యూజోన్‌లో. అమీర్‌పేటలో ఇటువంటి మాల్‌ లేదు. ఇప్పుడు ఏర్పాటు చేసిన వాల్యూజోన్‌ స్థానంలో ముందుగా బిగ్‌బాజార్‌ ఉండేది. అ తర్వాత రిలయన్స్‌ మార్ట్‌గా మారింది. తర్వాత అది మూతపడిపోయింది. తర్వాత ఇంటే ప్రస్తుతం వాల్యూజోన్‌ ఏర్పాటు అయ్యింది.

Cleaning Tips: ఐరన్‌ పాత్రలకు తుప్పు వదలడం లేదా? ఈ ట్రిక్‌తో క్షణాల్లోనే మటుమాయం!

బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *