Uttar Pradesh: ఐపీఎస్ అధికారి ఇంట్లో చోరీ.. నగదు, ఖరీదైన గడియారాలు, 20 బాత్రూమ్ సింక్‌ల సహా దోచుకెళ్ళిన దొంగలు

Uttar Pradesh: ఐపీఎస్ అధికారి ఇంట్లో చోరీ.. నగదు, ఖరీదైన గడియారాలు, 20 బాత్రూమ్ సింక్‌ల సహా దోచుకెళ్ళిన దొంగలు


ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని విలాసవంతమైన వికాస్ నగర్ ప్రాంతంలోని ఒక ఐపీఎస్ అధికారి ఇంట్లో జరిగిన చోరీ సంచలనం సృష్టించింది. నోయిడాలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి)గా నియమితులైన ఐపీఎస్ అధికారి యమునా ప్రసాద్ ఇంట్లో దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. దొంగలు కిటికీ గ్రిల్‌ను తీసి.. ఇంట్లోకి ప్రవేశించారు. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఇంటిలో ఉన్న నగదు, వెండి ఆభరణాలను మాత్రమే కాకాదు 20 బాత్రూమ్ సింక్‌లను కూడా దొంగిలించారు.

2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన యమునా ప్రసాద్ ప్రస్తుతం నోయిడా కమిషనరేట్‌లో శాంతిభద్రతల డీసీపీగా పనిచేస్తున్నారు. ఆయన లక్నో నివాసం 1/197, వికాస్ నగర్.. ఈ ఇల్లు చాలా కాలంగా ఖాళీగా ఉంది. ఆయన బంధువు అసిత్ సిద్ధార్థ్ ఇంటిని చూసుకుంటున్నాడు. సెప్టెంబర్ 23న అసిత్ తలుపు తెరిచినప్పుడు.. దొంగతనం జరిగినట్లు గుర్తించారు.

ఇంట్లోనుంచి వేటిని దొంగలు దొంగాలించారంటే

  1. దాదాపు 50 వేల రూపాయలు నగదు
  2. 10 వెండి నాణేలు
  3. 3 ఖరీదైన వాచీలు, 2 గోడ గడియారాలు
  4. వెండి సామాను
  5. బహుమతి వస్తువులు
  6. 20 బాత్రూమ్ సింక్‌, కుళాయిలు

యమునా ప్రసాద్ అనారోగ్యం కారణంగా చికిత్స నిమిత్తం నోయిడాలోని ఆసుపత్రిలో చేరినప్పుడు ఈ సంఘటన జరిగింది. దొంగిలించబడిన వస్తువుల మొత్తం విలువ లక్షల్లో ఉంటుందని అంచనా. సంఘటన గురించి సమాచారం అందుకున్న వికాస్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. లక్నో పోలీసుల బృందం వెంటనే సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. చుట్టుపక్కల ప్రాంతంలోని సిసిటివి ఫుటేజ్‌లను పరిశీలించింది.

ఇవి కూడా చదవండి

దొంగలు ముందుగానే తనిఖీ

దొంగలు జాగ్రత్తగా రెక్కీ వేసి మరీ ఈ ఇంటిలో దొంగ తనం చేసినట్లు.. ఇల్లు ఖాళీగా ఉండడంతో నిఘా ఉంచారని ప్రాథమిక పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం ఇది పక్కా ప్రణాళికాబద్ధంగా జరిగిన సంఘటనగా కనిపిస్తోందని.. ఇద్దరు లేదా ముగ్గురు దొంగల ముఠా ఈ దొంగతనం చేసి ఉండవచ్చు అని చెప్పారు. వేలిముద్రలు, ఫుటేజ్ ఆధారంగా అనుమానితుల కోసం పోలీసులు దొంగల కోసం వేట మొదలు పెట్టారు. దొంగలను త్వరలో పట్టుకుంటాము” అని వికాస్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ తెలిపారు. ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. అయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *