UPSC 2025 Topper Story: ‘రోజుకు 13 గంటలు చదివా.. నో కోచింగ్‌! ఆలూచాట్‌తో సెలబ్రేషన్స్..’ యూపీఎస్సీ టాపర్‌ సక్సెస్ జర్నీ

UPSC 2025 Topper Story: ‘రోజుకు 13 గంటలు చదివా.. నో కోచింగ్‌! ఆలూచాట్‌తో సెలబ్రేషన్స్..’ యూపీఎస్సీ టాపర్‌ సక్సెస్ జర్నీ


UPSC 2025 Topper Story: ‘రోజుకు 13 గంటలు చదివా.. నో కోచింగ్‌! ఆలూచాట్‌తో సెలబ్రేషన్స్..’ యూపీఎస్సీ టాపర్‌ సక్సెస్ జర్నీ

దేశంలోనే అత్యంత కఠినమైన యూపీఎస్సీ సివిల్స్‌ వడపోతను దాటుకుని గట్టెక్కడం అందరికీ సాధ్యం కాదు. అహోరాత్రులు కాష్టపడి తన మూడో ప్రయత్నంలో ఏకంగా టాప్‌ ర్యాంకు కొట్టాడు ఈ డాక్టర్ బాబు. యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ 2025 ఆల్‌ ఇండియా టాపర్‌ డాక్టర్ అనుజ్ అగ్నిహోత్రి ప్రయాణం మీరూ తెలుసుకోండి..

ఎవరీ డాక్టర్‌ అనుజ్‌ అగ్నిహోత్రి?

రాజస్థాన్‌లోని కోట సమీపంలో రావత్‌ బాటా అనే సిటీకి చెందిన అనుజ్‌ తల్లిదండ్రులు క్రిష్ బిహారీ అగ్నిహోత్రి, మంజు అగ్నిహోత్రి. తండ్రి అణు విద్యుత్ సంస్థలో విధులు నిర్వహిస్తున్నారు. తల్లి గృహిణి. అనుజ్‌ తొలుత ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జోధ్‌పూర్ నుండి MBBS పూర్తి చేశాడు. ఆ తర్వాత మెడికల్ ట్రైనింగ్‌ (ఇంటర్న్‌షిప్‌) చేస్తూనే యూపీఎస్సీకి ప్రిపరేషన్‌ సాగించాడు. సీనియర్లు, సహోద్యోగుల మద్ధతుతో పని భారాన్ని పంచుకోవడం ద్వారా ప్రిపరేషన్‌కు సమయం లభించినట్లు చెబుతున్నాడు. అయితే తొలి రెండు ప్రయత్నాల్లో విఫలమైనప్పటికీ మూడో ప్రయత్నంలో ఏకంగా ఫస్ట్ ర్యాంకు కొట్టాడు. నిజానికి ఎక్కడా కోచింగ్‌ తీసుకోకుండానే మొదటి ప్రయత్నంలో ఉదయం 6 గంటలకు నిద్రలేచి రాత్రి 11.30 గంటల వరకు చదివినట్లు తెలిపాడు. అయినప్పటికీ రెండు సార్లు విఫలమయ్యాడు. ఆ తర్వాత తన ప్రిపరేషన్‌లో కొన్ని మార్పులు చేశాడు. ఈసారి చదువుతోపాటు కొంత సమయం వినోదానికి కేటాయించాడు. ఎదురు దెబ్బలు సహజమేనని.. ఈ రోజు నేను విజయం సాధించలేకపోయినా తదుపరి ప్రయత్నానికి మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టేవాడినని అనుజ్‌ చెబుతున్నాడు.ఇది విజయంలో భాగం. వైఫల్యాన్ని ముగింపుగా భావించకూడదు. బదులుగా వ్యూహాలను తిరిగి మలచుకోవడానికి సంకేతంగా భావించాలని చెప్పాడు. అలాగే ప్రిపరేషన్ సమయంలో కుటుంబంతో సమయం గడపడం ఎంత ముఖ్యమో కూడా అనుజ్‌ చెప్పాడు.

ప్రిపరేషన్‌లో అనూజ్‌ చేసిన త్యాగాలు..

అనుజ్‌ యూపీఎస్సీకి ప్రిపరేషన్‌ సాగించిన తర్వాత స్నేహితులు, సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉన్నట్లు తెలిపాడు. సివిల్‌ సర్వీసెస్‌ వంటి సుదీర్ఘ పరీక్షలు జ్ఞానాన్ని ఎంత పరీక్షిస్తాయో.. ఓర్పును కూడా అంతే పరీక్షిస్తాయి. సమస్యలు రావచ్చు, కానీ అవి ఫలితాన్ని నిర్వచించాల్సిన అవసరం లేదు. యూపీఎస్సీ ప్రిపరేషన్‌ ఒక మారథాన్ అని.. సివిల్ సర్వీస్ కోసం అభ్యర్థులు అసలు తాము ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్రణాళికను రూపొందించుకోవాలని అనూజ్ చెబుతున్నాడు. అనూజ్‌కు ‘అలూచాట్‌’ ఇష్టమైన వంటకం. తన ప్రతి విజయాన్ని సెలబ్రెట్‌ చేసుకోవడానికి దీనిని ఇష్టంగా తింటానని చెప్పాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు, నేను సంగీతం వింటాను. కొన్ని శారీరక యోగాసనాలు చేస్తానని చెప్పాడు. ప్రజలతో మాట్లాడటం ద్వారా కొత్త ఆలోచనలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తానని అన్నాడు. అంతేకాదు అనూజ్‌.. ఎంఎస్ ధోనికి పెద్ద అభిమాని.

విజయం సాధించని వారికి అనూజ్‌ ఇచ్చిన సలహాలు.. సూచనలు..

వైఫల్యం బాధాకరమైనదే కానీ అంతిమం కాదని ఆయన అన్నారు. తన స్నేహితులు కొందరు ప్రతి ప్రయత్నం నుంచి పాఠాలు నేర్చుకుంటూ సిద్ధమవుతూ ఇప్పటికీ ప్రిపరేషన్‌ చేస్తూనే ఉన్నారు. ఇటువంటి అనుభవాలు వ్యక్తిత్వాన్ని, స్థితిస్థాపకతను పెంపొందిస్తాయి. ఇవి జీవితానికి ప్రేరణ ఇస్తాయని ఆయన పేర్కొన్నారు.

UPSC విజయ గాథలు కొన్నిసార్లు దూరంగా కనిపిస్తాయి. గణాంకాలు, ర్యాంకులను చూస్తే దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. ఏ విజయానికైనా క్రమశిక్షణ ముఖ్యం. కానీ ఆశ కూడా అంతే ముఖ్యం. కలలకు సమయం పట్టవచ్చు. మార్గాలు మలుపు తిరగవచ్చు. అయినప్పటికీ ప్రయత్నం, దృఢత్వంతో, అసాధారణ లక్ష్యాలు చేరుకోవచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *