Upendra: హీరో ఉపేంద్ర కూతురును చూశారా? అందంలో అప్సరస.. స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు.. ఫొటోస్ వైరల్

Upendra: హీరో ఉపేంద్ర కూతురును చూశారా? అందంలో అప్సరస.. స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు.. ఫొటోస్ వైరల్


కన్నడ స్టార్ ఉపేంద్రకు తెలుగులోనూ భారీగా అభిమానులు ఉన్నారు. అందుకే అతని సినిమాలన్నీ తెలుగులోనూ రిలీజవుతుంటాయి. ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు ఉప్పీ. కలీషా అనే పాత్రలో కనిపించింది కొద్ది సేపే అయినా తన స్క్రీన్ ప్రజెన్స్ తో ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేశాడీ స్టార్ హీరో. ప్రస్తుతం ఉప్పీ చేతిలో దాదాపు అరడజనకు పైగా సినిమాలున్నాయి. హీరోగా నాలుగు సినిమాలు చేస్తోన్న ఈ ట్యాలెంటెడ్ హీరో తెలుగులోనూ ఓ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతోన్న ఆంధ్రా కింగ్ తాలుకాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా ఉపేంద్ర భార్య పేరు ప్రియాంక. ఆమె కూడా ప్రమఖ నటినే. . తెలుగులోనూ కూడా పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. జేడీ చక్రవర్తి నటించిన సూరి సినిమాతో పాటు ఉపేంద్ర హీరోగా నటించిన రా, హెచ్ 2ఓ సినిమాల్లోనూ ప్రియాంకనే హీరోయిన్ గా నటించింది. ఓవరాల్ గా ఇప్పటివరకు సుమారు 50 కు పైగా సినిమాల్లో యాక్ట్ చేసింది ప్రియాంక.

ఇవి కూడా చదవండి

ఉపేంద్ర కూతురి లేటెస్ట్ ఫొటోస్..

ఇక ఉపేంద్ర, ప్రియాంకల వివాహం 2003లో జరిగింది. ఇప్పుడు వీరికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడు పేరు ఆయుష్ కాగా కూతురు పేరు ఐశ్వర్య. ప్రస్తుతం వీరు బెంగళూరులోని వ్యాలీ స్కూల్ లో చదువుకుంటున్నారు. అయితే ఐశ్వర్య ఓ వైపు చదువుతూనే.. 2019లో ‘దేవకీ’ అనే చిత్రంతో నటిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇందులో ఆమె తల్లి ప్రియాంకతో కలిసి నటించింది. కన్నడ-తమిళ భాషల్లో ఈ సినిమా రిలీజైంది. అయితే ఐశ్వర్యకు వేరే డ్రీమ్ ఉందని తెలుస్తోంది. అదేంటంటే.. ఆమెకు జర్నలిజం అంటే ఆసక్తి అని, జర్నలిస్ట్ కావాలని కోరుకుంటోందట. అంటే మనం ఉపేంద్ర కూతురును సినిమాల్లో చూడలేమా? ఏమో ఆమె నిర్ణయం మార్చుకుని ఇండస్ట్రీలోకి రావచ్చేమో? లెట్స్ వెయిట్ అండ్ సీ..

కూతురు పుట్టిన రోజు వేడుకల్లో ఉపేంద్ర దంపతులు..

ఉపేంద్ర ఫ్యామిలీ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *