TVK Vijay Rally Stampede: హీరో విజయ్ సభలో తొక్కిసలాట .. విశాల్ షాకింగ్ రియాక్షన్

TVK Vijay Rally Stampede: హీరో విజయ్ సభలో తొక్కిసలాట .. విశాల్ షాకింగ్ రియాక్షన్


ప్రముఖ సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్‌ పొలిటికల్ ర్యాలీ సందర్భంగా ఘోర విషాదం చోటు చేసుకుంది. శనివారం (సెప్టెంబర్ 28) రాత్రి తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కసలాటలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు ఉండడం శోచనీయం. మృతదేహాలు, బాధిత కుటుంబాల రోదనలతో ఆస్పత్రుల్లో విషాదకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో పాటు పలువురు మంత్రులు, నాయకులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఈ క్రమంలో విజయ్ సభలో జరిగిన తొక్కిసలాటపై హీరో విశాల్ స్పందించారు. ‘టీవీకే విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 30 మందికి పైగా మరణించారని తెలిసి నా హృదయం తరుక్కుపోతోంది. అమాయకులు ప్రాణాలు కోల్పోవడం మరీ బాధాకరం. బాధిత కుటుంబాలకు టీవీకే పార్టీ పరిహారం ఇవ్వాలి. ప్రస్తుతానికి మీరు చేయగలిగింది అదొక్కటే. ఇక ముందు జరిగే పొలిటికల్ సభలు, ర్యాలీల్లోనైనా భద్రతా చర్యలపై దృష్టి పెడతారని ఆశిస్తున్నాను’ అని (ఎక్స్) ట్వీట్ లో రాసుకొచ్చారు విశాల్.

ఇవి కూడా చదవండి

విశాల్ తో పాటు రజనీకాంత్, కమల్ హాసన్, పవన్ కల్యాణ్ తదితరులు ఈ విషాద ఘటనపై స్పందించారు.  కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అమాయకులు ప్రాణాలు కోల్పోయిన వార్త నా గుండెను బరువెక్కించింది. తీవ్రమైన విషాదంలో మునిగిపోయాను. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని వేడుకొంటున్నాను అని రజనీకాంత్ ట్వీట్ చేశారు.

హీరో విశాల్ ట్వీట్..

రజనీకాంత్ రియాక్షన్..

‘కరూర్ తొక్కిసలాట దుర్ఘటన వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ విషాద వార్తతో నా మనసు మూగబోయింది. అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే వార్త నన్ను తీవ్రంగా బాధించింది. బాధితులకు సరైన,మెరుగైన చికిత్స అందించాలని తమిళనాడు ప్రభుత్వానికి మనవి చేసుకొంటున్నాను. బాధితులకు ప్రభుత్వం అండగా నిలువాలని కోరుతున్నాను’ అని కమల్ హాసన్ ట్వీట్ చేశారు.

కమల్ హాసన్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *