తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు వసతి సమస్యను తీర్చేందుకు కొత్త వసతి గృహాన్ని నిర్మించింది. వెంకటాద్రి నిలయం పేరుతో నిర్మించబడిన ఈ భవనం 2018లో 102 కోట్ల రూపాయలతో ప్రారంభించబడింది. ఐదు అంతస్తుల్లో రెండు బ్లాకులుగా నిర్మించబడిన ఈ వసతి గృహం 4000 మంది భక్తులకు వసతి కల్పిస్తుంది. 1500 మందికి భోజనం చేసేలా రెండు పెద్ద డైనింగ్ హాళ్లు, ప్రతి అంతస్తులో రెండు ఆర్ఓ ఫిల్టర్ వాటర్ ప్లాంట్లు, 16 డార్మెంటరీ హాళ్లు మరియు 2500 లగేజ్ లాకర్లు ఏర్పాటు చేయబడ్డాయి. తిరుమల ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న ఈ వెంకటాద్రి నిలయాన్ని బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 25న ప్రారంభించనున్నారు. టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, టీటీడీ ఈవో మరియు అదనపు ఈవోలు ఇప్పటికే ఈ వసతి గృహాన్ని సందర్శించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిలువెత్తు తులాభారాన్ని అమ్మవారికి సమర్పించిన CM రేవంత్
గుంటూరులో డయేరియా, కలరా కేసుల టెన్షన్
తెలంగాణను రక్షించమని CM రేవంత్ రెడ్డి ని కోరుతున్నా
ఖమ్మం YSR కాలనీ లో దొంగల బీభత్సం
ఊరును శవాల దిబ్బగా మారుస్తున్న సింగరేణి కాలుష్యం