Trisha: పార్ధిబన్ కు త్రిష కౌంటర్‌.. మైక్ దొరికిందని ఏది పడితే మాట్లాడావంటే..

Trisha: పార్ధిబన్ కు త్రిష కౌంటర్‌.. మైక్ దొరికిందని ఏది పడితే మాట్లాడావంటే..


Trisha: పార్ధిబన్ కు త్రిష కౌంటర్‌.. మైక్ దొరికిందని ఏది పడితే మాట్లాడావంటే..

తమిళనాడు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో దళపతి విజయ్ – త్రిష కలిసి ఇటీవల ఓ వెడ్డింగ్ రిసెప్షన్ కి హాజరవ్వడం సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు విజయ్ సతీమణి సంగీత తన భర్తకు ఓ నటితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన టైంలో.. వీరిద్దరూ కలిసి ఒకే కారులో ఏకంగా ఓ శుభకార్యానికి వెళ్లడం సంచలనంగా మారింది. దీనిపై నెటిజన్లు, అభిమానులు, సినీ ప్రముఖులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. త్రిష తాజాగా చేసిన ఓ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది. త్రిషపై సీనియర్ నటుడు పార్ధిబన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. చెన్నైలో ఓ అవార్డ్ ఫంక్షన్‌కి పార్ధిబన్‌‌ హాజరయ్యారు. స్క్రీన్ పై త్రిష ఫోటో ప్రదర్శించి ఆమెపై అభిప్రాయం చెప్పమని అడగ్గా.. ‘పొన్నియన్ సెల్వన్‌’ సినిమాలో త్రిష పోషించిన కుందవై పేరుతో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ”ఈ కుందవై కొన్నాళ్లు ఇంట్లోనే కూర్చుంటే బెటర్. ఆమె బయట అడుగుపెట్టడం చాలా సమస్యలకు కారణమవుతోంది” అని పార్ధిబన్ కామెంట్‌ చేసారు. వీడియో వైరల్ అవుతున్న తరుణంలో త్రిష ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. ” మైక్ చేతిలో ఉందని మాట్లాడినంత మాత్రాన అది తెలివైన వ్యాఖ్య లేదా కామెడీనో అవ్వదు. అది కేవలం మూర్ఖత్వాన్ని మరింత పెద్దగా వినిపించేలా చేస్తుంది. జ్ఞానం లేకుండా మాట్లాడే అసభ్య పదాలు, అవి ఎవరిని లక్ష్యంగా చేసుకున్నాయనే దాని కంటే, ఆ మాట్లాడిన వ్యక్తి.. తత్వాన్ని ఎక్కువగా బయటపెడతాయి” అని త్రిష ట్వీట్ లో రాసుకొచ్చారు. పార్ధిబన్ వ్యాఖ్యలకు కౌంటర్ గానే త్రిష ఈ పోస్ట్ పెట్టినట్లు నెటిజన్లు భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ నిర్వాకం.. పిల్లలతో మసాజ్‌..

రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం.. మరి మీకు కావాలా..

లైవ్ వీడియోలో యూట్యూబర్‌ ఆత్మహత్యా యత్నం.. బాబోయ్

Weather Update: దంచికొడుతోన్న ఎండలు.. ఈ ఏడాది దబిడిదిబిడే

విరోష్ పెళ్లిపై చిన్నారి పాప అలక.. మమ్మల్ని ఎందుకు పిలవలేదు?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *