Toxic : అభిమానులకు షాకిచ్చిన యష్.. టాక్సిక్ సినిమాకు ఊహించని నిర్ణయం..

Toxic : అభిమానులకు షాకిచ్చిన యష్.. టాక్సిక్ సినిమాకు ఊహించని నిర్ణయం..


కన్నడ రాకింగ్ స్టార్ యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ టాక్సిక్. కేజీఎఫ్ 1, 2 చిత్రాల తర్వాత ఈ హీరో నటిస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన గ్లింప్స్, టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో ఉగాది కానుకగా ఈ సినిమా అడియన్స్ ముందుకు రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు చిత్రయూనిట్ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా.. తాజాగా ఈ చిత్రాన్ని వాయిదా వేసినట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు కొత్త తేదీని సైతం వెల్లడించారు. ఈ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : రామ్ చరణ్‏ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని.. అప్పుడే ప్రభాస్‏కు చెప్పా.. టాలీవుడ్ నటుడు..

పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధ భయం పెరుగుతుంది. ఈ సంక్షోభం ఇంకా పరిష్కారం అయినట్లు కనిపించడం లేదు. అబుదాబి వంటి ప్రదేశాలలో దాడులు జరుగుతున్నాయి. ఈ కారణంగానే టాక్సిక్‌ సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. మార్చి 8న ఈ సినిమా ట్రైలర్ విడుదల కావాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన సన్నహాలు సైతం పూర్తయ్యాయి. అయితే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా సినిమా వాయిదా పడింది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : అమీర్ పేట్ మెట్రో పక్కన ఉన్న సారథి స్టూడియో మాదే.. కానీ.. టాలీవుడ్ నటుడు..

మరోవైపు ధురంధర్ 2 సైతం అటు గల్ఫ్ దేశాలలో విడుదల కావడం లేదు. ఇక భారతదేశంలో మాత్రం ఈ సినిమాకు లైన్ క్లియర్ అయిపోయినట్లే. గతేడాది డిసెంబర్ లో ఎలాంటి హడావిడి లేకుండా విడుదలైన ధురంధర్ సినిమా సంచలనం సృష్టించింది. ఏకంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇదిలా ఉంటే టాక్సిక్ చిత్రాన్ని ‘కెవిఎన్’ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి యష్ కూడా నిర్మాత. ఇందులో మొత్తం ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదేం సినిమా రా బాబూ.. నరాలు తెగిపోయే సస్పెన్స్, ట్విస్టులు. ఓటీటీలో దుమ్మురేపుతుంది..

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : హలో బ్రదర్ సినిమాలో నాగార్జునకు డూప్‏గా నటించింది ఆ స్టార్ హీరోనా.. ? అస్సలు ఊహించలేదుగా.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *