యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ప్రమాదం! అన్నపూర్ణ స్టూడియోలో ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్న ప్రముఖ నటుడు ఎన్టీఆర్ ప్రమాదవశాత్తు గాయాల పాలయ్యారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ యాడ్ షూటింగ్ జరుగుతోంది. ఇందులో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. అయితే, షూటింగ్ సమయంలో ఓ చిన్న ప్రమాదం జరగ్గా.. తారక్‌కి స్వల్ప గాయాలయ్యాయి. అయితే, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, అవి స్వల్ప గాయాలేనంటూ ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. కానీ ఈ న్యూస్ ఇప్పుడు తారక్ ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలోనూ ఎన్టీఆర్ పలు సినిమాల షూటింగ్స్ సమయంలో గాయపడ్డారు. అలాగే 2009 ఎన్నికల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అప్పుడు ఆయన కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఈ సందర్భంగా అభిమానులు ఆ నాటి ఘటనను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే అందుకే ఇప్పుడు ఎన్టీఆర్ కి ప్రమాదం అనే వార్త వినగానే.. అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే అది ఆందోళన చెందాల్సినంత పెద్ద ప్రమాదం కాదని, ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారని న్యూస్ వినిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విజయ్ ఇంట్లోకి ఆగంతకుడు.. టెన్షన్‌లో పోలీసులు
Ram Charan: ఆర్చరీ బ్రాండ్ అంబాసిడర్‌గా చెర్రీ.. అక్టోబరు 2 నుంచి ఢిల్లీలో పోటీలు
Deepika Padukone: ‘కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు!’
ఏటా శివ మాల వేసుకుంటా.. పీరియడ్స్ రాకుండా ఆ పని చేస్తా…
Little Hearts: లిటిల్ హార్ట్స్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో..