ఆరోగ్యకరమైన జీవనానికి దంత సిరి కూడా చాలా ముఖ్యం. దంతాలు పసుపు రంగులోకి మారితే చూసేందుకు ఇబ్బందికరంగా ఉంటాయి. అందుకే వాటిని సరిగ్గా చూసుకోవడం చాలా ముఖ్యం. దంతాలు ఎందుకు పసుపు రంగులోకి మారుతాయంటే..?
రోజూ బ్రష్ చేస్తున్నప్పటికీ కొందరికి పసుపు దంతాల సమస్య వేధిస్తుంటుంది. దీని వల్ల పంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆనక పంటి నొప్పికి కూడా కారణం అవుతుంది. అందుకే దంతాల ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవడం చాలా ముఖ్యం. నిజానికి పసుపు దంతాలు విటమిన్ డి కి సంబంధించిన సమస్య. ఈ విటమిన్ లోపం వల్ల దంతాలు దెబ్బతింటాయి.
శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే, దంతాలు పసుపు రంగులోకి మారతాయి. విటమిన్ డి లోపం వల్ల దంతాల ఎనామిల్ కూడా బలహీనపడుతుంది. ఈ ఎనామిల్ కోల్పోవడం వల్ల మీ దంతాల మూలంలో ఉన్న పసుపు డెంటిన్ మరింత స్పష్టంగా కనిపిస్తుంది. దీనివల్ల దంతాలు పసుపు రంగులో కనిపిస్తాయి.
విటమిన్ డి లోపం ఉన్నవారు పాలు, పెరుగు అధికంగా తీసుకోవాలి. వాటిలో విటమిన్ డి అధిక మొత్తంలో ఉంటుంది. విటమిన్ డి కోసం చేపలను కూడా తినవచ్చు. పాలకూర, పుట్టగొడుగులను తినడం ద్వారా విటమిన్ డి అధికంగా లభిస్తుంది.
అలాగే స్ట్రాబెర్రీల్లో మాలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది దంతాలను మెరిపిస్తుంది. వీటిలోని శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు దంతాలపై మరకలకు కారణమైన బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయి. చిగుళ్లలో వాపు రాకుండా చేస్తాయి.