Tollywood: 70కు పైగా సినిమాలు చేసిన ఈ నటి గుర్తుందా? ఆమె మేనల్లుడు ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో.. ఎవరంటే?

Tollywood: 70కు పైగా సినిమాలు చేసిన ఈ నటి గుర్తుందా? ఆమె మేనల్లుడు ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో.. ఎవరంటే?


ఒకప్పుడు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఓ వెలుగు వెలిగింది నటి లతా శ్రీ. హీరోయిన్ గా, సహాయక నటిగా, విలన్ గా ఆడియెన్స్ ను అలరించింది. . విజయవాడకు చెందిన లతా శ్రీ పదో తరగతి చదివే రోజుల్లోనే ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ నూతన నటీనటులుకావాలని పేపర్‌లో వేసిన యాడ్ చూసి.. ఫొటోలు పంపింది. ఆ వెంటనే ఆ సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యింది. ఆ వెంటనే నటిగా బిజీగా మారిపోయింది. తెలుగులో యమలీల, నెంబర్ వన్, ఆ ఒక్కటీ అడక్కు, ముద్దుల మేనల్లుడు, అబ్బాయి గారు, పోలీస్ భార్య, ఇంద్ర భవనం, దీపావళి, అల్లరోడు, దొరబాబు, బాల చంద్రుడు తదితర సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసింది లతా శ్రీ. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఈమెను చిట్టి చెల్లలు అని పిలిచే వారు. ఎందుకంటే అప్పట్లో హీరోయిన్‌గానే కాకుండా ఇండస్ట్రీలోని స్టార్ హీరోలకు చెల్లెలుగా చేసిందీ అందాల తార.ఇక యమలీల, ఆ ఒక్కటి అడక్కు సినిమాల్లో లతా శ్రీ పోషించిన పాత్రలు బాగా గుర్తుండిపోయాయి. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 70 కిపైగా చిత్రాల్లో నటించిన ఈ సీనియర్ నటి 1999 తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. అయితే 2007లో ఈవీవీ సత్యనారాయణ- అల్లరి నరేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అత్తిలి సత్తిబాబు’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది. దీని తర్వాత మరే మూవీలోనూ లతాశ్రీ కనిపించలేదు.

లతా శ్రీ ఒక జిమ్ ట్రైనర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.ఇద్దరూ ఇంజనీరింగ్ చదువుతున్నట్లు సమాచారం. అయితే లతా శ్రీ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఆమె మేనల్లుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోగా దూసుకుపోతున్నాడు. అతను మరెవరో కాదు నాగ శౌర్య. ఈ విషయాన్నిలతాశ్రీనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గ్యాప్ వచ్చిందని తెలుస్తోంది. ఇరు కుటుంబీకుల మధ్య మాటల్లేవని కూడా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

తల్లితో హీరో నాగ శౌర్య..

ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాడు నాగ శౌర్య. పోలీస్ వారి హెచ్చరిక, బ్యాయ్ బాయ్ కార్తీక్ తో పాటు నారీ నారీ నడుమ మురారీ అనే సినిమాలతో బిజీగా ఉంటున్నాడు నాగ శౌర్య. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *