
ప్రముఖ నటుడు చంద్రమోహన్ తన సినీ ప్రస్థానం గురించి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దర్శకుడు కె. విశ్వనాథ్ తన సొంత పెద్దనాన్న కొడుకేనని, అయితే ఈ విషయం తనకు సినీ పరిశ్రమలోకి వచ్చాకే తెలిసిందని పేర్కొన్నారు. తనతో నటించిన హీరోయిన్లు స్టార్ స్టేటస్ సంపాదించారని.. ఇది ప్రచారం కాదని కేవలం కాకతాళీయంగా జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇది చదవండి: ఇంట్లో బీరువా ఈ దిక్కున పెడితే.. వద్దన్నా డబ్బు మీ ఇంటికి వస్తుంది
భానుప్రియ, రాధిక, విజయశాంతి, సులక్షణ, శ్రీదేవి, జయప్రద, జయసుధ లాంటి ఎందరో స్టార్ హీరోయిన్స్‌తో చంద్రమోహన్ కలిసి నటించారు. విజయశాంతితో ఎనిమిది చిత్రాలు, జయప్రదతో ఎనిమిది చిత్రాలు చేసిన చంద్రమోహన్, జయసుధతో ఏకంగా 25 సినిమాల్లో నటించడం విశేషం. జయసుధతో ఆయన జోడి 1970లు, 1980లలో అత్యంత విజయవంతమైన కలయికలలో ఒకటిగా నిలిచింది. శ్రీదేవితో మాత్రం కేవలం ఒక సినిమాకే పరిమితం కావాల్సి వచ్చిందని, ఆమె తొలి సినిమా తర్వాత రామారావు, కృష్ణ లాంటి అగ్ర హీరోల సరసన నటించే స్థాయికి ఎదిగారని చంద్రమోహన్ తెలిపారు. తన చిత్రాల బడ్జెట్‌కు శ్రీదేవిని తీసుకోవడం కష్టమయ్యిందని వివరించారు. అయినప్పటికీ, తనతో నటించిన అందరు హీరోయిన్లు తాను ఎక్కడ కనిపించినా గౌరవంగా పలకరిచేవారని, ఆ బంధం ఒక సెంటిమెంట్‌గా నిలిచిందని ఆ ఇంటర్వ్యూలో చంద్రమోహన్ అన్నారు. తాను దాదాపు 48 మందికి పైగా హీరోయిన్స్‌ను తెలుగు తెరకు పరిచయం చేశానని వెల్లడించిన ఈ లెజెండరీ నటుడు 2023లో కన్నుమూశారు.
ఇది చదవండి: ప్రతీ ఇంట్లో కరెంట్ బిల్లు రూ. 100 కూడా రాదు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు