Tollywood: 13 ఏళ్లకే తోపు హీరోయిన్.. 21 ఏళ్ల వయసులోనే మరణం.. సౌత్ ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్..

Tollywood: 13 ఏళ్లకే తోపు హీరోయిన్.. 21 ఏళ్ల వయసులోనే మరణం.. సౌత్ ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్..


ఒకప్పుడు ఆమె తోపు హీరోయిన్. 13 ఏళ్ల వయసులో తెరంగేట్రం చేసింది. 15 ఏళ్లకే ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. చిన్న వయసులోనే బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఆమె మరణించింది. 21 ఏళ్ల వయసులోనే ఆమె మరణం ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. ఆమె ఎవరో తెలుసా.. మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ పేరు మోనిషా.. మోహినియాట్టం నర్తకి శ్రీదేవి ఉన్ని, వ్యాపారవేత్త నారాయణ్ ఉన్ని దంపతులకు జన్మించింది. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకుంది. 13 ఏళ్లకే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. కేవలం 15 సంవత్సరాల వయస్సులో భారత ప్రభుత్వం నుండి జాతీయ అవార్డును అందుకోవడం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.

ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

చాలా తక్కువ సమయంలోనే – కేవలం ఆరు సంవత్సరాలలో – 25 కి పైగా చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించింది. ఆమె అందం, నటనతో అప్పట్లో విమర్శలు ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా అప్పట్లో కుర్రాళ్ల ఆరాధ్య దేవతగా మారింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలో నే లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ సొంతం చేసుకుంది. మోనిషా ఉన్ని పేరు సినిమా చరిత్రలో చెరగని ముద్ర. 1986లో ‘నక్కక్షతంగల్’ చిత్రంలో తొలిసారిగా నటించింది. ఆమె 15 సంవత్సరాల వయస్సులో జాతీయ అవార్డును గెలుచుకుంది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

మోనిషా ఉన్ని 1992లో కేరళలో జరిగిన కారు ప్రమాదంలో 21 సంవత్సరాల వయసులో మరణించింది. ప్రమాదం జరిగిన సమయంలో, ఆమె తన తల్లితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, అది KSRTC బస్సును ఢీకొట్టింది. నివేదికల ప్రకారం, ఆమె వెనుక సీట్లో నిద్రపోతోంది. ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మరణించింది. అంతకు ముందు ఆమె నటించిన చివరి చిత్రంలోనూ ఆమె పాత్ర చనిపోయినట్లు ఉంటుంది. మూవీ విడుదలైన కొన్ని రోజులకే మోనిషా మరణించింది.

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *