Tollywood : సరైనోడు సినిమాలో ఆ రోల్ నేను చేయాల్సింది.. కానీ.. షూటింగ్ కు పిలిచి అవమానించారు.. టాలీవుడ్ నటి..

Tollywood : సరైనోడు సినిమాలో ఆ రోల్ నేను చేయాల్సింది.. కానీ.. షూటింగ్ కు పిలిచి అవమానించారు.. టాలీవుడ్ నటి..


Tollywood : సరైనోడు సినిమాలో ఆ రోల్ నేను చేయాల్సింది.. కానీ.. షూటింగ్ కు పిలిచి అవమానించారు.. టాలీవుడ్ నటి..

టాలీవుడ్ హీరోయిన్ గీతా సింగ్.. కితకితలు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో కామెడీ పాత్రలతో మెప్పించిన ఆమె.. ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన సినీ అనుభవాలను పంచుకున్నారు. సరైనోడు చిత్రంలో ఒక పాత్ర కోసం తనను ఎంపిక చేసినప్పటికీ, చివరి నిమిషంలో ఆ పాత్రను వేరే వారికి ఇచ్చారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ సంఘటన తనను తీవ్రంగా బాధించిందని, అయితే కొన్ని విషయాలను చూసీ చూడనట్టు వదిలేయాల్సి వస్తుందని తెలిపారు. ఈ విషయంపై దర్శకుడు బోయపాటి శ్రీనును తాను అడగలేదని, ఆయనపై ఇప్పటికీ గౌరవం ఉందని పేర్కొన్నారు. ఆయనకు ఈ విషయం చేరిందో లేదో కూడా తెలియదని ఆమె అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Dil Raju: హీరోయిన్‏కు కళ్లు లేవని ఎవరు కొనలేదు.. నేను తీసుకుని రిలీజ్ చేశా.. ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. దిల్ రాజు..

అదే విధంగా, రాజా ది గ్రేట్ చిత్రంలో కూడా తనకు ఒక పాత్ర ఆఫర్ చేశారని, ఒక నెలపాటు ఔట్‌డోర్ షూటింగ్ ఉంటుందని చెప్పారని గీతా సింగ్ వివరించారు. కానీ రెండు రోజుల తర్వాత ఫోన్ చేసినప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడి నంబర్ కలవలేదని, చివరికి ఆ పాత్రను కూడా వేరే నటి చేశారని ఆమె చెప్పారు. ఒకసారి అనిల్ రావిపూడిని కలిసినప్పుడు దీని గురించి అడగగా, తనకు తెలియదని ఆయన సమాధానమిచ్చారని గీతా సింగ్ తెలిపారు. ఈ పాత్ర కోసం తాను ఇతర రెండు సినిమాలను కూడా వదులుకున్నానని, అందువల్ల తాను చాలా బాధపడ్డానని ఆమె పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్, ప్రభాస్‏లతో బ్లాక్ బస్టర్స్.. ఇండస్ట్రీనే అల్లాడించిన గ్లామరస్ బ్యూటీ.. క్యాన్సర్‏ను జయించి ఇలా..

మోహన్ బాబు కుటుంబ సభ్యులు, ముఖ్యంగా విష్ణు మంచు, తన కుమారుడికి ఉచిత విద్య అందించడానికి చేసిన ప్రయత్నాన్ని గీతా సింగ్ గుర్తు చేసుకున్నారు. షూటింగ్ జరుగుతున్నప్పుడు తన పిల్లలు ఇంటివద్ద ఎదురు చూస్తున్నారని చెప్పడంతో, విష్ణు మంచు తన కొడుకుకు విద్య అందించాలనే ఆలోచనతో మోహన్ బాబుతో చర్చించి, టెన్త్ క్లాస్ ఫలితాల రోజున స్వయంగా ఫోన్ చేసి ఉచిత విద్యను ఆఫర్ చేశారని ఆమె తెలిపారు. ఇలాంటి గొప్ప మనసున్న వ్యక్తిని ఎవరూ చూడరని గీతా సింగ్ ప్రశంసించారు.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట భయ్యా.. 29 ఏళ్లుగా ట్రెండింగ్.. మనసును హత్తుకునే సాంగ్.. వింటే వదలరు..

Geetha Singh Movies

Geetha Singh Movies

ఎక్కువమంది చదివినవి : Cinema : అరె ఏంట్రా ఇది.. 15 ఏళ్లైనా నాగార్జున సినిమాకు తగ్గని డిమాండ్.. ఇప్పుడు ఓటీటీని అల్లాడిస్తోన్న మూవీ..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *