పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు ఎవరో తెలుసా.. ? ఇప్పుడు ఇండస్ట్రీలో ఆమె సెన్సేషన్. టీనేజ్ లోనే సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తర్వాత తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించే ఛాన్స్ వచ్చింది. కానీ కొన్ని కారణాలతో ఆ మూవీని రిజెక్ట్ చేసింది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో దూసుకుపోతుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? చూడచక్కని రూపం, ఉంగరాల జుట్టుతో యూత్ కు ఇష్టమైన హీరోయిన్ ఆమె. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ పేరు అనుపమ పరమేశ్వరన్. 2016లో వచ్చిన ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
ఇవి కూడా చదవండి
ఆ తర్వాత నితిన్, సమంత నటించిన అఆ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. అలాగే శర్వానంద్ జోడిగా శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగి, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐలవ్యూ, హలో గురు ప్రేమకోసమే వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. నిఖిల్ సరసన కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా బ్యూటీగా మారింది. అదే సమయంలో బటర్ ఫ్లై, 18 పేజీస్ వంటి లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమాలో ముందుగా కథానాయికగా ఎంపికైందట. కానీ కొన్ని కారణాలతో ఈ మూవీని రిజెక్ట్ చేసిందట. చివరకు ఆమె స్థానంలోకి సమంత వచ్చింది.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
ఇటీవలే కిష్కంధపురి చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే పరదా చిత్రంలోనూ నటించింది. ఇవే కాకుండా ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు మలయాళంలోనూ వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇటీవలే జానకి వర్సెస్ కేరళ చిత్రంతో నటిగా ప్రశంసలు అందుకుంది.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తగ్గని క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..