బుల్లితెరపై తనకంటూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది దీపికా పిల్లి. ఒకప్పుడు టిక్ టాక్ వీడియోస్ చేసి విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక అదే ఫేమ్ తో బుల్లితెరపైకి అడుగుపెట్టింది. పలు షోలలో యాంకరింగ్ చేస్తూ అలరించింది.
తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు కథానాయికగా మారిన సంగతి తెలిసిందే. జబర్దస్త్, డీ షోలలో యాంకర్ గా మెరిసిన దీపికా.. ఆ తర్వాత వాంటెడ్ పండుగాడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమాతోపాటు యాంకర్ ప్రదీప్ మాచిరాజుతో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలోనూ నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు పెద్దగా ఆడలేదు. అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. ఈ అమ్మడు నెట్టింట చాలా యాక్టివ్.
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా తర్వాత ఇండస్ట్రీలో దీపికా సైలెంట్ అయ్యింది. అటు బుల్లితెరపై కూడా కనిపించడం లేదు. తాజాగా ఈ అమ్మడు తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పింక్ కలర్ లెహంగాలో మరింత అందంగా కనిపిస్తుంది దీపికా. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు ఇన్ స్టాలో 2.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే ఈ బ్యూటీకి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో సరైన అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.




