సినీ పరిశ్రమ తరచు అంచనాలకు మించి నటీనటుల ఎంపికతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఇండస్ట్రీలో కెరీర్ పీక్ లో ఉండగానే కొందరు హీరోయిన్స్ తల్లి పాత్రలు పోషించారు. ఇప్పుడు యంగ్ హీరోయిన్స్ సైతం కెరీర్ మంచి ఫాంలో ఉండగానే కంటెంట్, పాత్ర ప్రాధాన్యతను బట్టి హీరోలకు తల్లులుగా నటిస్తున్నారు. ఇదివరకు బాహుబలి సినిమాలో అనుష్క శెట్టి ప్రభాస్ తల్లి పాత్రలో కనిపించింది. అలాగే మరో హీరోయిన్ సైతం ఓ స్టార్ హీరోకు తల్లిగా నటించింది. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే. హిందీ సినిమా ప్రపంచంలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దీపికా ఓస్టార్ హీరోకు తల్లిగా కనిపించిందని మీకు తెలుసా.. ? అతడు మరెవరో కాదు.. షారుఖ్ ఖాన్. కెరీర్‌లో అత్యున్నత స్థాయిలో ఉన్నప్పటికీ, ఆమె తెరపై షారుఖ్ ఖాన్ తల్లిగా నటించేందుకు అంగీకరించింది.
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
ఇవి కూడా చదవండి
2007లో ఓం శాంతి ఓం సినిమాతో నటిగా సినీప్రయాణం స్టా్ర్ట్ చేసింది దీపికా పదుకొణె. ఇందులో ఆమె షారుఖ్ సరసన నటించింది. అప్పట్లో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఫస్ట్ మూవీతోనే రాత్రికి రాత్రే స్టార్ డమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో అనేక చిత్రాలు వచ్చాయి..ఈ సినిమా తర్వాత వీరిద్దరు కలిసి డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ చెన్నై ఎక్స్‌ప్రెస్ (2013)లో తిరిగి నటించారు. ఇందులో దక్షిణాది అమ్మాయి పాత్రలో దీపికా యాక్టింగ్ అదరగొట్టింది. ఈ సినిమాలో దీపికా, షారుఖ్ కెమిస్ట్రీ జనాలను ఆకట్టుకుంది.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
ఆ తర్వాత 2014లో మరోసారి హ్యాపీ న్యూ ఇయర్ చిత్రంలో నటించారు. 2023 లో సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన స్పై యాక్షన్ మూవీ పఠాన్ చిత్రంలో కలిసి నటించారు. ఇది YRF బ్యానర్‌లో ఆ సంవత్సరంలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ఇక అదే ఏడాది కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ చిత్రంలో నటించింది. అయితే ఇందులో ఆమె షారుఖ్ తల్లిగా కనిపించింది.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..
జవాన్ సినిమాలో అతిథి పాత్రలో.. విక్రమ్ రాథోడ్ భార్యగా, ఆజాద్ తల్లిగా నటించింది. ఇందులో విక్రమ్ రాథోడ్, ఆజాద్ పాత్రలలో షారుఖ్ నటించడం విశేషం. ఈ సినిమాలో షారుఖ్ తల్లిగా కనిపించి జనాలను ఆశ్చర్యానికి గురిచేసింది దీపికా. ఇప్పుడు ఆమె అల్లు అర్జున్, అట్లీ సినిమాలో నటిస్తుంది. అలాగే మరోసారి షారుఖ్ సరసన నటిస్తుంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.25 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్.
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ తగ్గని క్రేజ్.. ఈ బ్యూటీ ఎవరంటే..