టాలీవుడ్‌లో అక్కినేని కుటుంబం ప్రత్యేకమైన అభిమానాన్ని కలిగి ఉంది. నాగేశ్వరరావు నటవారసులుగా నాగార్జున, సుమంత్, నాగచైతన్య, అఖిల్, సుశాంత్ వెండితెరపై సత్తా చాటుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో చిన్న వయసులో ఉన్న సుమంత్‌ని నాగార్జున ఎత్తుకుని ఉన్నారు. ఈ ఫోటో అక్కినేని అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. నాగార్జున తన తండ్రికి తగ్గ తనయుడిగా, సుమంత్ తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఒక సినిమాలో కూడా నటించిన విషయం తెలిసిందే. అభిమానులు ఈ అరుదైన ఫోటోను షేర్ చేస్తున్నారు.