హీరోయిన్ శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జర్నలిజం చదువుతూ సినీరంగంలోకి అడుగుపెట్టింది. ముంబైలోని బెంగాలీ కుటుంబంలో జన్మించిన. ఆమె ముంబై విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా (జర్నలిజం) డిగ్రీని పొందింది. ఆమె జర్నలిస్ట్ కావాలని అనుకున్నారు, కానీ అనుహ్యంగా మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది.
శ్రద్ధా నటనను సీరియస్‌గా తీసుకుంది. ఆమె నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD)లో పియూష్ మిశ్రా, చిత్తరంజన్ గిరి వంటి ప్రముఖ నటులతో కలిసి థియేటర్ వర్క్‌షాప్‌లకు హాజరైంది. ఈ శిక్షణ ఆమెకు సినీరంగంలో రాణించడానికి సహయపడింది. శ్రద్ధ 2008లో “సిద్ధు ఫ్రమ్ సికాకుళం” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది
తొలి చిత్రంలోనే ఆమె అద్భుతమైన నటన అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఆమెకు తెలుగులో మంచి ఆఫర్స్ వచ్చాయి. శ్రద్ధను చిత్ర పరిశ్రమలో “సీక్వెల్ క్వీన్” అని పిలుస్తారు. ఎందుకంటే ఆమె ఆర్య 2, నాగవల్లి సీక్వెల్స్‌లో కీలక పాత్రలు పోషించింది. 2010లో, శ్రద్ధా “లాహోర్” చిత్రంతో “ఇడా” పాత్రలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
శ్రద్ధా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీతో సహా ఐదు కంటే ఎక్కువ భాషలలో 50 కి పైగా చిత్రాలలో నటించింది. కానీ ఇప్పటివరకు ఈ అమ్మడు సరైన హిట్టు మాత్రం అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఓటీటీలో పలు వెబ్ సిరీస్ సైతం చేస్తుంది.
సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌లు మరియు, టీవీ షోలలో కూడా ఆమె ప్రతిభను ప్రదర్శించింది. మరోవైపు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ తెగ సెన్సేషన్ అవుతుంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.




